ఆంధ్రప్రదేశ్‌

ప్రజల భాగస్వామ్యంతోనే 2019 ఎన్నికల విజన్ డాక్యుమెంట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశ్యంతో వారి సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి సూచనలు కూడా వారి నుండే స్వీకరిస్తున్నామని బీజీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ తెలిపారు. 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ విజన్ డాక్యుమెంట్ (మానిఫెస్టో)ను రూపొందించనుంది. ఈ డాక్యుమెంట్‌లో పొందుపరచాల్సిన అంశాలు నిపుణులచే కాకుండా ప్రజలచే రూపొందించాలని భావించింది. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం, ఆకాంక్షలు తెలుసుకుని వాటిని అమలు చేయడం వంటివి ఇందులో భాగం. దీని నిమిత్తం బీజేపీ నాయకులు దేశంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తున్నారు.

ఈ మేరకు విజయవాడలో ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు, వ్యాపారులతో గురువారం రాంమాధవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, సహ ఇన్‌చార్జి సునీల్ డియోధర్ పాల్గొని వారి సూచనలు సేకరించారు. అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో రాంమాధవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు, వౌలిక సదుపాయాలతో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ‘్భరత్ కే మన్ కీ బాత్, మోదీ కే సాత్’ పేరుతో దేశంలోని అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు సేకరించి బీజేపీ 2019 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించనున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అవినీతి, అరాచక ప్రభుత్వం పాలన సాగించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.