ఆంధ్రప్రదేశ్‌

పలువురు ఐఏఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, నియామకాలను చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్‌ను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆర్టీజీఎస్ బాధ్యతలను కూడా ఆయన నిర్వహిస్తారు. కార్మిక శాఖ కమిషనర్ డి.వరప్రసాద్‌ను పౌరసరఫరాల శాఖ కార్యదర్శిగా నియమించింది. విపత్తు నిర్వహణ శాఖ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. గనుల శాఖ కార్యదర్శి ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్‌కు చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. పి.లక్ష్మీనరసింహంను జీఏడీ కార్యదర్శిగా, పోస్టింగ్ కోసం వేచి ఉన్న కె.మాధవీలతను ఉపాధి శాఖ సంచాలకురాలిగా, ఎం.విజయసునీతను పౌరసరఫరాల శాఖ సంచాలకురాలిగా, జి.సి.కిషోర్ కుమార్‌ను వికాలంగుల సంక్షేమ శాఖ సంచాలకునిగా నియమించింది. కృష్ణా జిల్లా డీఆర్వో బి.లావణ్య వేణిని భూపరిపాలనా విభాగంలో సంయుక్త కార్యదర్శిగా, పి.శ్రీనివాసులను డీఆర్‌డీవో పీడీగా నియమించింది. కె.విజయను ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ సీఈవోగా, ధనంజయ రెడ్డిని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. ఏపీ రాష్ట్ర వైద్య వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సీఈవో ఎ.ప్రసాద్‌ను కృష్ణా జిల్లా డీఆర్వోగా, నియాకమం కోసం వేచిఉన్న బి.శ్రీనివాసరావును మత్స్యశాఖ పరిధిలో ఉంచింది. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడా)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.అద్దయ్యను రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఒంగోలు పీవోగా, రాష్ట్ర విపత్తు నిర్వహణ, ప్రాధికార సంస్థ కృష్ణా జిల్లా పీవో సరళావతిని, ముడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, ముడాకు చెందిన జి.కేశవ నాయుడును సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, విపత్తు నిర్వహణ సంస్థ కడప పీవో రాజకుమారిని ముడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, కడప డీఆర్‌డీఏ పీడీ ఎస్.సత్యంను కడప స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, నియామకం కోసం వేచిఉన్న జయకుమార్‌ను తెలుగుగంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉప్పల జగదీష్ బాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కళింగ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా దువ్వాడ కృష్ణమూర్తి నాయుడును నియమించింది. గ్రామ పంచాయతీల జీతాలను 10 వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తొమ్మిది మంది అదనపు ఎస్పీల బదిలీ
రాష్ట్రంలో తొమ్మిది మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రూరల్ క్రైం అదనపు ఎస్పీ ఎం వెంకటేశ్వర్లును ప్రకాశం జిల్లా అడ్మిన్ ఏడిసిపిగా బదిలీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న లావణ్య లక్ష్మీని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా వెయిటింగ్‌లో ఉన్న ఎన్‌విఎస్ మూర్తిని గుంటూరు రూరల్ క్రైం అదనపు ఎస్పీగా, ఏవి రమణను విశాఖపట్న అడ్మిన్ అదనపు డీసీపిగా నియమనించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్‌డి బి శరత్‌బాబును విశాఖ రూరల్ అడ్మిన్‌గా బదిలీ చేశారు. తిరుపతి క్రైం అదనపు ఎస్పీ డి సిద్దారెడ్డిని మార్కాపూరం ఒఎస్‌డిగా బదిలీ చేశారు. అదేవిధంగా విజయవాడ సిటి ట్రాఫిక్ అదనపు డీసీపీ టివి నాగరాజును కర్నూలు జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్‌వి మాధవరెడ్డిని విజయవాడ సిటి ట్రాఫిక్ అదనపు డీసీపీగా బదిలీ చేశారు. ఇక విశాఖ రూరల్ అదనపు ఎస్పీ పివి రవికుమార్‌ను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.