ఆంధ్రప్రదేశ్‌

దళారీ వ్యవస్థ నుంచి గిరిజన రైతులను కాపాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: దళారీ వ్యవస్థ నుంచి గిరిజన రైతాంగాన్ని కాపాడుతామని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ భరోసా ఇచ్చారు. జీసీసీ కొత్త చైర్మన్‌గా ప్రసాద్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జీసీసీ గిరిజనుల ఆర్ధికాభివృద్ధికి తోడ్పడే రాష్టస్థ్రాయి సంస్థగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వ దిశానిర్ధేశంలో జీసీసీ ప్రాధాన్యతలను మార్చుకుంటూ, నూతన ఒరవడితో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. గిరిజన రైతులు వారి వ్యవసాయ, ఉద్యానవన పంటలు, అటవీ ఫలసాయాల్ని త్వరితగతిన మార్కెటింగ్ చేసుకోవడానికి, సకాలంలో వైద్యసౌకర్యం పొందేందుకు, గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాల మెరుగుకు జీసీసీ కొత్తగా పెట్రోలు, డీజిల్ అమ్మకాలు ప్రారంభించిందన్నారు. జీసీసీ 15 పెట్రోలు, డీజిల్ బంకులను గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిందన్నారు. త్వరలో మరో ఐదు బంకులను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. గిరిజన రైతుల నుండి అటవీ ఉత్పత్తులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన పంట దిగుబడులను కూడా కొనుగోలు చేస్తుందన్నారు. ఈ సరుకుల కొనుగోలు లక్ష్యం రూ.100 కోట్ల వరకు నిర్ధేశించుకుందన్నారు. రాష్ట్రంలోని 96 గిరిజన మండలాల్లో 5595 గిరిజన గ్రామాలకు అనుసంధానించి రైతులకు సమీప దూరంలో 268 ప్రాథమిక కొనుగోలు కేంద్రాలను కొత్తగా ప్రారంభించిందన్నారు. గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళు, టోకు అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా వాటి నుండి నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్‌లో రిటైల్ అమ్మకాలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్‌కుమార్, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, జీసీసీ ఎండీ టీ.బాబూరావునాయుడు పాల్గొన్నారు.