ఆంధ్రప్రదేశ్‌

నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల నొటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో శనివారం సమావేశం కానుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండవల్లిలోని ప్రజావేదికలో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేడో, రేపో వెలువడవచ్చని భావిస్తున్న తరుణంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 10 ఎమ్మెల్సీల పదవులకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక గురించి ప్రధానంగా చర్చించనున్నారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీయేతర పక్షాలతో ఏర్పడనున్న కూటమి, కనీస ఉమ్మడి కార్యక్రమం, బీజేపీ, వైకాపా, తెరాస వైఖరిపై కూడా చర్చించనున్నారు. ఎన్నికల్లో ఆ మూడు పార్టీల వ్యూహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంపై చర్చించనున్నారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో చేపట్టిన వివిధ ప్రజాకర్షక పథకాల గురించి మరింతగా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన ముఖ్యమంత్రి, మిగిలిన నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ సమీకరణలపై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు.