ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ ట్రస్టుల విభజనకు కుదిరిన అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: గడచిన నాలుగున్నర ఏళ్లుగా పెండింగ్‌లో వున్న ఆర్టీసీ ఎస్‌ఆర్‌బీటీ, ఎస్‌బీటీ ట్రస్ట్‌ల విభజనకు ఇటు ఆంధ్రా అటు తెలంగాణా ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. ఇప్పటివరకు కలిసి ఉన్న స్ట్ఫా రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ ట్రస్ట్ (ఎస్‌ఆర్‌బీటీ), స్ట్ఫా బెనిఫిట్ ట్రస్ట్(ఎస్‌బిటి) విభజనకు స్థానిక ఆర్టీసీ హౌస్‌లో ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్‌వి సురేంద్రబాబు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నేతలతో జరిగిన సమావేశం అంగీకరించింది.