ఆంధ్రప్రదేశ్‌

చదువులో ప్రతిభ చూపించండి ఫాతిమా వైద్య విద్యార్థులతో ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: ఫాతిమా వైద్యకళాశాల బాధిత విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ చూపి జీవితంలో మంచి వైద్యులుగా స్థిరపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఫాతిమా వైద్య కళాశాల బాధిత విద్యార్థులకు 13 కోట్ల రూపాయలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా, ఉండవల్లిలోని నివాసంలో విద్యార్థులు ముఖ్యమంత్రిని శుక్రవారం కలిశారు. బాధిత విద్యార్థులకు భారీ మొత్తంలో రీయింబర్స్‌మెంట్ చేసి మానవతా దృక్పధంతో వ్యవహరించిందుకు ధన్యవాదాలు తెలిపారు. 42 మంది విద్యార్థులకు 13 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఫరూక్, ఆదినారాయణ రెడ్డి, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి
క్యూ కట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు

విజయవాడ, ఫిబ్రవరి 15: గుంటూరు జిల్లా తుళ్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యూ కట్టారు. ఈ నెల 13న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాజధాని అమరావతిలో ఇళ్లస్థలాలు కేటాయించేందుకు నిర్ణయించడం తెలిసిందే. అదే రోజు రాత్రి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. శుక్రవారం దాదాపు 20 మంది అధికారులు తమ ప్లాట్లను రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ఆర్టీసీ ఎండీ, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు ఉన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ 9 గంటలకు పెంపు

విజయవాడ, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ 7 గంటల మేర విద్యుత్ సరఫరా చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా మరో రెండు గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లు 17.85 లక్షలు ఉన్నాయి. కాగా దారిద్య్ర రేఖకు దిగువున్న కుటుంబాలకు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవల పరిమితిని 2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం ఇంటి వద్ద సొమ్మసిల్లిన మహిళ

విజయవాడ, ఫిబ్రవరి 15: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన ఒక మహిళ శుక్రవారం సొమ్మసిల్లి పడిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసేందుకు కాకినాడకు చెందిన నళిని అనే మహిళ ఉదయం 6 గంటలకు వచ్చింది. కాకినాడలో ఒక ప్రజాప్రతినిధి ఇల్లు ఇస్తానని లక్ష రూపాయలు కట్టించుకుని, ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసేందుకు ఆమె వచ్చింది. అయితే ముఖ్యమంత్రిని కలిసేందుకు అధికారులు సమయం ఇవ్వకపోవడంతో ఆమె సొమ్మసిల్లిపడిపోయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.