ఆంధ్రప్రదేశ్‌

కూటమి ఏర్పాటుతో బీజేపీ నేతల్లో భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: సార్వత్రిక ఎన్నికలకు ముందే పొత్తులు సాధ్యం కాదన్నారని, దానిని సాధ్యం చేయడంతో బీజేపీ నేతల్లో భయం పట్టుకుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, బాధ్యులతో ఆయన శుక్రవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నికల ముందు కూటమి సాధ్యంకాదన్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కూటమి సాధ్యం అని తేలటంతో తమపై కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ చేశారన్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ, వైకాపా, టీఆర్‌ఎస్ ఉమ్మడి అజెండా అని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఆస్తులున్న వారికి బెదిరింపుల దగ్గరనుంచి ఒక్కొక్కరికీ ఒకో స్వార్థ ప్రయోజనం ఉందన్నారు. గుజరాత్‌ను మించిపోతుందేమోనన్న భయం మోదీది అని, తానేమీ చేయలేదన్నది బయటపడుతుందేమోననేది కేసీఆర్ భయమని, ఎక్కడ టీడీపీ పాతుకుపోతుందోననేది జగన్ భయమని వ్యాఖ్యానించారు. మూడు పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. అందుకే టీడీపీ ధర్మపోరాటానికి అండగా ఉన్నారన్నారు. జగన్, కేసీఆర్ నాటకం దేశం మొత్తం తెలిసిపోయిందన్నారు. అందుకే ఏ పార్టీ వాళ్లతో జతకట్టటం లేదని ఆరోపించారు. టీడీపీ ధర్మపోరాటానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే 22 పార్టీలు అండగా ఉన్నాయన్నారు. మనం చేస్తోంది ధర్మ యుద్ధమని, కుట్రదారులకు ఓటమి తప్పదని హెచ్చరించారు. ఏపీకి నిధుల విడుదలకు మోదీ సహకారం లేదని, ఆస్తుల విభజనకు కేసీఆర్ సహకరించరని తెలిపారు. కేసులతో జగన్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ముగ్గురి కుట్రల లక్ష్యం ఏపీకి నష్టం చేయడమేనన్నారు. వీటిపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మూడుపార్టీల కుట్రలను ప్రజలే తిప్పికొడతారన్నారు. ఏపీకి అన్యాయంపై అన్ని కమిటీలు స్పందించాయని, పార్లమెంటరీ స్థాయి సంఘాలు నిరసించాయన్నారు. చిదంబరం కమిటీ కూడా ప్రశ్నించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిలదీసిందన్నారు. అరకొర విపత్తు సాయాన్ని మెయిలీ కమిటీ నిగ్గదీసిందన్నారు. తిత్లీ నష్టం సగానికి తగ్గించడాన్ని ప్రశ్నించిందన్నారు. విపత్తు సాయం ఏటా 15 శాతం పెంచాలని, హుదూద్ తుపాను నష్టం ఇంకా 400 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. కేరళకు దుబాయ్ సాయాన్ని కేంద్రం అడ్డుకుందన్నారు. రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వదని, ఇతరులను సాయం చేయనివ్వదని ఆరోపించారు. మోదీ పాలనలో పెడధోరణులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని అందరూ నిలదీయాలన్నారు. స్వార్థం కోసం పార్టీ మారితే ప్రజలు ఆదరించరని, ఢిల్లీలో ఇటీవల జరిగిన ధర్నాలో తనతో అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారని గుర్తు చేశారు. కొద్ది గంటల్లోనే జగన్ గూటికి చేరారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులకు లొంగిపోయారన్నారు. ఆమంచి పార్టీ మారగానే చీరాలలో నిరసనలు వెల్లువెత్తాయని, కార్యకర్తల్లో కసికి అదే నిదర్శమని వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాలను ప్రజలు ఆదరించరన్నారు. ఒకవైపు రాష్ట్రం కోసం ఢిల్లీపై పోరాటం చేస్తూనే, మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించానన్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అన్ని ప్రాంతాలను సమతుల్యం చేస్తున్నానన్నారు. ప్రతి జిల్లాకు ఒక వర్సిటీ ఏర్పాటు చేస్తున్నానని, లేని చోట్ల వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐదు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆదరణ, యువనేస్తం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, పుసుపు-కుంకుమ, వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే మన లక్ష్యమన్నారు. 2019-24 ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రెట్టింపు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యమన్నారు. సమర్థనాయకులుగా తయారు కావాలని, పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఈ ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని స్పష్టం చేశారు.