ఆంధ్రప్రదేశ్‌

లోటస్ పాండ్ జగన్నాటకాన్ని అసహ్యించుకుంటున్న జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: అవకాశవాద రాజకీయాల కోసం అవినీతి పరులతో చేరతామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదుగానీ, పార్టీ వీడుతూ బురదజల్లే కార్యక్రమాలు తగవని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలోని జలవనరులశాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 68 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధిని ముందుకు తీసుకెళ్లుతుంటే ఢిల్లీ కుట్రలో భాగంగా జగన్, కేసీఆర్‌ల నాయకత్వంలో లోటస్‌పాండ్‌లో వలస రాజకీయాలకు తెరలేపారన్నారు. మొన్న ఆమంచి కృష్ణమోహన్, నిన్న అవంతి శ్రీనివాస్, నేడు దాసరి జై రమేష్ పార్టీ మారుతూ తెలుగుదేశం పార్టీపై బురద జల్లటం దారుణమన్నారు. పార్టీ మారితే మారవచ్చుగానీ పార్టీపై అభాండాలు వేయడం తగదన్నారు.
రూ. 54 లక్షల పెన్షనర్లకు పెద్దకొడుకుగా, 94 లక్షల డ్వాక్రా మహిళలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కుల మతాలకు అతీతంగా పెన్షన్లు, పసుపు -కుంకుమ 2 కింద సాయం అందిస్తున్నారన్నారు. ఒక అవినీతి పరుడి పక్కన కూర్చొని మాపై నిందలు మోపుతూ నీతులు చెబుతారా అని దేవినేని ప్రశ్నించారు. చెడ్డ వ్యక్తులతో కాపురం చేస్తూ టీడీపీ అవినీతి పార్టీగా ఉందనటం, అవమానకరంగా పరిపాలన చేస్తున్నారనటం, జగన్ వైట్‌షర్ట్‌లో స్వచ్ఛంగా కనిపిస్తున్నారనడం సిగ్గుచేటని, ప్రజలు మీ మాటల్ని అసహ్యించుకుంటున్నారన్నారు.