ఆంధ్రప్రదేశ్‌

స్వర్ణముఖి పనుల్లో కోట్లలో అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 16: నెల్లూరు జిల్లాలో 2007లో వచ్చిన వరదలకు దెబ్బతిన్న స్వర్ణముఖి నది పొర్లుకట్టలు, కాలువల నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిధులు విడుదల చేశారు. 2008లో ఆరు ప్యాకేజీలుగా రూ.278.75 కోట్లతో అధికారిక అనుమతికి పంపారు. అనంతరం మరికొన్ని పనులను జోడించి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏడు శాతం తక్కువతో జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు రమేష్‌కుమార్, బీవీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ పేరిట టెండర్లు దక్కించుకొని 2015లో పనులు ప్రారంభించారు. పనులు పూర్తయిన తర్వాత విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పనుల్లో నాణ్యత లోపించిందని, లీడ్ ఎక్కువగా చూపించి ప్రభుత్వ సొమ్ము సుమారు రూ.13కోట్ల మేర కాజేసినట్లు నిర్ధారణకు వచ్చారు. బిల్లులు ఆపాలని విజిలెన్స్ అధికారులు సూచించినప్పటికీ అప్పటి నెల్లూరు ఇరిగేషన్ ఎస్ ఇ కోటేశ్వరరావు ఇతర అధికారులు కాంట్రాక్టర్‌కు రూ.5కోట్లు మినహా బిల్లులు చెల్లించేశారు. అప్పట్లో విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేయడం, తిరిగి ప్రస్తుతం విజిలెన్స్ ఉన్నతాధికారులు మరోసారి నివేదిక పరిశీలించి అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ రూ.8కోట్ల, 50లక్షల, 99వేల, 356లను కాంట్రాక్టర్లనుంచి రికవరీ చేయాలని, కాంట్రాక్టర్లతో పాటు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సదరు కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఎక్కడ పనులు చేస్తున్నా బిల్లులు నిలిపివేయాలని అప్పటి ఎస్ ఇ కోటేశ్వరరావు(రిటైర్డ్), ఇ ఇ పి.సురేష్‌బాబు, డి. ఇ.సూర్యనారాయణనాయక్ జీతాలు, పింఛన్ నుండి వసూలు చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే ఈ ఉత్తర్వులు ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయని వారి ఆదేశాల మేరకు నడుచుకుంటామని జిల్లా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.