ఆంధ్రప్రదేశ్‌

అవంతి, ఆమంచి... కాపు ద్రోహులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: వైకాపాలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాపు ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన వైకాపాలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. కాపుల సంక్షేమానికి నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించిన ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక స్థాయి వారిద్దరికీ లేదన్నారు. వారిద్దరినీ ఆడవాళ్లు చీపుర్లతో కొడతారని హెచ్చరించారు. వైకాపా అధికారంలోకి రాదని, ఇక మంత్రి పదవులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. అయిదేళ్లు టీడీపీలో కొనసాగి, ముఖ్యమంత్రితో ఎన్నో పనులు చేయించుకున్న ఆమంచికి సిగ్గులేదని, అవంతికి విశ్వాసం లేదని ధ్వజమెత్తారు. దమ్ము, ధైర్యం ఉన్న వాళ్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని, గెలుస్తామనే ధైర్యం ఉంది కాబట్టే రాజీనామాలు చేశారన్నారు. ఇప్పటికే ఇద్దరు చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అంశంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.