ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్షురాలిగా శాంతాభవాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా శాంతాభవాని ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరులోని ఎన్జీవో సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ నర్సుల సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష, కార్యదర్శి పదవులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా బి రాజశేఖర్ వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా శాంతాభవాని (కర్నూలు) 12ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉపాధ్యక్షురాలిగా జ్యోతి (గుంటూరు) 10ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా కోటమ్మ (గుంటూరు ఏవీవీపీ), కోశాధికారిణిగా ఇంధిర (విశాఖపట్నం) తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఎన్నికల అధికారి రాజశేఖర్ వారికి ధ్రువీకరణ పత్రాలు అందించి ప్రమాణస్వీకారం చేయించారు. ఈసందర్భంగా శాంతాభవాని మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఉన్న నర్సుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తాజా ఎన్నికలతో రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ రద్దైనట్లు కార్యవర్గం పేర్కొంది. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బాజిత్, నగర శాఖ అధ్యక్షుడు సుకుమార్, జిల్లా నర్సుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బెల్లంకొండ శైలజ, వెల్లంపల్లి పద్మజ, తదితరులు అభినందించారు.