ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కి బీసీలు ఓటేస్తే పాముకు పాలుపోసినట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 17: పాముకు పాలుపోసినా, జగన్‌కు బీసీలు ఓటువేసినా వారు కాటుకు గురికాక తప్పదని వైఎస్ కుటుంబ చరిత్రే స్పష్టంచేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ విమర్శించారు. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి పాము అని తెలియక చేనేత వర్గానికి చెందిన బైరైటీస్ గనుల యజమాని జింకా వెంకటనరసయ్య ఆశ్రయమిస్తే ఆయనే్న చంపి గనులను దురాక్రమణ చేసిన చరిత్ర మీ వంశానిది కాదా అంటూ జగన్‌ను నిలదీశారు. ఆదివారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుండి ఈమేరకు ఆయన వైసీపీ అధినేత జగన్‌కు రాసిన బహిరంగ లేఖ విడుదల చేశారు. మేకవనె్న పులి అని తెలియక ప్రజలు మీ తండ్రికి అధికారమిస్తే ఆయన బీసీలపై కక్ష సాధించారని విమర్శించారు. రిజర్వేషన్ శాతం పెంచకుండా 31కులాలను బలవంతంగా బీసీ జాబితాలో చేర్చి బడుగుల నోరు కొట్టారన్నారు. ఒకసారి మోసపోయి పొరబడ్డామని బడుగువర్గాలు భావిస్తున్నాయని, రెండోసారి మోసపోయేందుకు బీసీలు సిద్ధంగా లేరన్నారు. బీసీలను మరోమారు మోసం చేసేందుకే బీసీ గర్జన సభ పెట్టారని విమర్శించారు. బలహీన వర్గాల ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అంటూ నిలదీశారు. వైఎస్ ఐదేళ్ల పాలనలో 23 జిల్లాల్లోని బీసీల సంక్షేమానికి ఖర్చుచేసింది కేవలం రూ.1600 కోట్లు మాత్రమేనని, లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి రూ.32వేల కోట్లు ఖర్చుచేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వైఎస్ కేవలం రూ.2,500 కోట్లు కేటాయిస్తే మరో రూ.2,400 కోట్లు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం 13 జిల్లాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇప్పటికే రూ.4 వేల కోట్లు చెల్లించిందన్నారు. ముదిగొండ, కాకరాపల్లి, సోంపేటలో బీసీలను కాల్చిచంపింది మీ తండ్రి వైఎస్ కాదా అంటూ కిమిడి నిలదీశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల నుండి అని, మేకతోలు కప్పుకున్నంతమాత్రాన పులి మేక కాబోదని వ్యాఖ్యానించారు. బీసీలు లేని బీసీ గర్జనకు తెలంగాణ నుండి బస్సులు పెట్టి ప్రజలను తరలించడంతోనే నవ్యాంధ్రలో బీసీలంతా టీడీపీతోనే ఉన్నారని మరోమారు రుజువైందని కళా వెంకట్రావ్ స్పష్టం చేశారు.