ఆంధ్రప్రదేశ్‌

పాకిస్తాన్ ప్రేరణతోనే ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 17: పాకిస్తాన్ ప్రేరణతోనే పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనికులపై ఉగ్రదాడి జరిగిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ దాడికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కన్నా మాట్లాడుతూ భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్యగా భావిస్తున్నామని, దాడికి పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా అమర జవాన్ల కుటుంబ సభ్యులకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నుంచి ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూ వారిని మట్టుపెడుతూ వచ్చారన్నారు. మిగిలిన కొన్ని ఉగ్రవాద సంస్థలు పాక్ ప్రోత్సాహంతో దాడులకు పాల్పడుతున్నాయని, గతంలో ముగ్గురు జవాన్లను ఉగ్రవాదులు హత్యచేస్తే దానికి ప్రతీకారంగా ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని గుర్తుచేశారు. జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహించిన వారికి తగిన బుద్ధిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమర జవాన్ల ప్రాణత్యాగం వృథాపోదని, పార్టీలకు అతీతంగా జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని కన్నా పిలుపిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నల్లబోతు వెంకట్రావ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సురేష్‌రెడ్డి, కార్యదర్శి వెంకటేష్ యాదవ్, కోశాధికారి సన్యాసిరాజు, యడ్లపాటి రఘునాథబాబు, ఆర్ లక్ష్మీపతి పాల్గొన్నారు.

చిత్రం.. ఉగ్రదాడిపై జరిగిన నిరసన ధర్నాలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ