ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ రంగ స్థలం... రాజమహేంద్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 18: చారిత్రక రాజమహేంద్రవరం రాజకీయ రంగ స్థలంలో కేంద్ర బిందువుగా మారింది. వివిధ రాజకీయ పార్టీల అధినేతల పర్యటనలకు రాజమహేంద్రవరం కీలకస్థానంగా మారింది. విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక రాష్ట్ర స్థాయి పరిణామాలకు రాజమహేంద్రవరం కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర స్థాయి సభలు, సమావేశాలకు వేదికగా ప్రాచుర్యం సంతరించుకుంది. 2014లో అపుడే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి గోదావరి పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం కార్యస్థలంగా మారింది. ఆ సమయంలో అమరావతి నిర్మాణ కీలక డాక్యుమెంట్లు, సింగపూర్ డిజైన్లు ఇక్కడే ఆమోదం పొందాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏడు మిషన్లకు సంబంధించిన ఆయా రంగాల నిపుణులతో సదస్సులు ఇక్కడే నిర్వహించడం ఆమోదం పొందడం జరిగింది. తొలి కేబినెట్ సమావేశం కూడా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బిలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్నో కీలక తీర్మానాలు చేశారు. గత ఎన్నికలకు ముందు జేఎస్పీ (జై సమాక్యాంధ్రా పార్టీ) పార్టీ ఆవిర్భావం సభ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాజమహేంద్రవరం వేదికగా జరిగింది. ఇలా ఎన్నో కీలక సందర్భాల్లో రాజకీయ రంగ స్థలంగా రాజమహేంద్రవరం మారింది. తాజాగా బీసీ రాజ్యాధికార ఆలోచనా క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సభను నిర్వహించి టీడీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. అనంతరం ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ బీసీ సింహగర్జన నిర్వహించి బీసీ డిక్లకేషన్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని కూడా గోదావరి జిల్లాల ఆవాసంగానే పూరించిందని చెప్పొచ్చు.
బీజేపీ, టీడీపీ సఖ్యతగా వున్నపుడు పార్టీ బలోపేతంలో భాగం సంస్థాగత పటిష్టత కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజమహేంద్రవరం వచ్చి స్థానిక ఆర్ట్సు కాలేజి గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున జరిగిన బహిరంగ సభలో ప్రసంగించడం జరిగింది.
టీడీపీతో చెలిమి చెడిన నేపధ్యంలో ఇరుపార్టీలు రాజకీయ కత్తులు నూరుకుంటోన్న పరిస్థితి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తాజాగా ఈ నెల 21వ తేదీన రాజమహేంద్రవరం వేదికగా సభలో మాట్లాడనుండటం రాజకీయ రంగంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏపీలో అన్ని పార్లమెంట్, అసెంబ్లీలకు నేరుగా పోటీ చేసి రాష్ట్రంలోని అధికార పార్టీకి బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామంటూ అమిత్‌షా ఈ సభను నిర్వహించడం సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అవినీతి చిట్టాను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టవంతమై రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక నిర్ణయానికి రాజమహేంద్రవరం అమిత్‌షా సభ కీలక భూమిక వహించనుందని అంచనా వేస్తున్నారు.
విభజన అనంతర పరిణామాల్లో మెల్లగా కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అడపా దడపా కార్యక్రమాలు నిర్వహించడం ఒకెత్తయితే, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజమహేంద్రవరం కేంద్రంగా పలు రాష్ట్ర స్థాయి సంస్థాగత కార్యక్రమాల కార్యాచరణకు వేదికను చేసుకున్నారు. పోలవరం సత్వర సాధన పాద యాత్ర, ప్రత్యేక హోదా కోటి సంతకాల సేకరణ తదితర కార్యక్రమాలను రఘువీరా ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టారు. ఇపుడు ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే ఇక్కడకు తీసుకొచ్చి సభను పెట్టించి, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కునే చందంగా వ్యవహరించడం రాజమహేంద్రవరం రాజకీయంగా మరింత కీలకంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ నెల 27వ తేదీన రాజమహేంద్రవరంలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. కోస్తా జిల్లాల్లోని ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రమైన రాజమహేంద్రవరంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే నిర్మాణాత్మకమైన విధానం నేపధ్యంలో రాజమహేంద్రవరం కీలక పరిణామాలకు కేంద్ర బిందువుగా మారింది. జయహో బీసీ సభతో చంద్రబాబునాయుడు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తే, బీసీ సింహగర్జనతో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ధనుస్సును సంధించారు. ఇక నేడో రేపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజమహేంద్రవరం కేంద్రంగానే ఎన్నికల భూమికకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ పవన్ సభకు భారీ ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
ఇక గోదావరి జిల్లాల్లో రాజకీయాలు జంపింగ్‌లతో రోజు రోజుకో మలుపు తిరుతున్నాయి. ఇటీవల పోలీసు శాఖలో రిటైరైన విశ్రాంత ఏలూరు రేంజి డిఐజీ రవికుమార్ మూర్తి జనసేనలో చేరి కొవ్వూరు టిక్కెట్‌తో బరిలోకి దిగనుండటం కొత్త పరిణామాలకు తెరలేపింది. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఈడీ డిఎంఆర్ శేఖర్ త్వరలో సెలవుపై ఆ శాఖ సాంకేతిక అనుమతితో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలిసింది. ఆయన జనసేన నుంచి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అక్కడ నిన్నటి వరకు టీడీపీ అమలాపురం ఎంపీగా వున్న పండుల రవీంద్రబాబు లోటస్ పాండ్‌లో ప్రత్యక్షం కావడం అనూహ్య పరిణామాలకు తావిచ్చినట్టయింది. కీలకమైన రాజమహేంద్రవరం పార్లమెంట్ బరిలో కూడా దిగ్గజ రాజకీయ నేతలతో పరిణామాలు అనూహ్యం కానున్నట్టు తెలుస్తోంది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా కీలక అడుగు వేయనున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు కొత్తతరం నాయకత్వం రాజకీయ అరంగేట్రంతో ఈసారి ఎన్నికలతో అనూహ్య మార్పులకు అలంబన కానున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రాజమహేంద్రవరం అనూహ్య రాజకీయ పరిణామాలకు కేంద్రబిందువుగా మారిందనండంలో సందేహంలేదు.