ఆంధ్రప్రదేశ్‌

నిధులు సద్వినియోగం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: సాంఘిక సంక్షేమ నిధి నుంచి ఇచ్చే సాయం నిర్దేశిత లక్ష్యాల మేరకు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పుణేఠా అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ నిధికి సంబంధించి రాష్టస్థ్రాయి కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈసందర్భంగా పుణేఠా మాట్లాడుతూ సమాజంలో అనాథలు, కుష్ఠు, క్షయ బాధితులు, మానసిక అనారోగ్యంతో ఉన్న పిల్లలకు పునరావాసం, వృత్తివిద్యా శిక్షణ, వైద్యసేవలు అందించడంతో పాటు విద్యావకాశాలు కల్పించేందుకు ఎంపిక చేసిన స్వచ్ఛంద సేవా సంస్థలకు ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తారన్నారు. ఈ నిధులు పొందుతున్న వివిధ సంస్థలు ఆశించిన లక్ష్యాలు సాధించేలా పనిచేయాలని సూచించారు. నిధులు ఏమేరకు సద్వినియోగం అవుతున్నాయన్న అంశంపై సాంఘిక సంక్షేమ శాఖ దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీలు పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర కమిటీ పరిశీలించి నిధులు విడుదల చేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం నుంచి సాయం పొందుతూ సేవలు అందిస్తున్నాయని సీఎస్ పుణేఠా వివరించారు.