ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల సంతోషం కోసమే జీతాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: పవిత్రమైన వృత్తి నిర్వహిస్తూ భక్తులకు, భగవంతునికి అనుసంధానకర్తలైన పురోహితులు పేదరికంలో ఉండటం తనను కలచివేసిందని, అందుకే వారి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ కోర్కెలను సానుభూతితో పరిశీలించి ఆమోదించినందుకు ముఖ్యమంత్రిని ఉండవల్లి ప్రజావేదిక వద్ద గురువారం అర్చకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 5000 రూపాయలు పొందుతున్న అర్చకుల జీతాన్ని 8000 రూపాయలకు, 10 వేల జీతం పొందుతున్న వారికి 12500 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఇందుకోసం 16 కోట్ల రూపాయలు ఇవ్వాలని టీటీడీ బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్నిన్ని గుర్తు చేశారు. రెండు లక్షల రూపాయల వార్షికాదాయం ఉండే దేవాలయాల బాధ్యతను ఆయా గ్రామాల్లోని ధార్మిక భావాలు కలిగిన దాతను ఎంపిక చేసి, అర్చకులతో కమిటీ వేసి కమిషనర్ ద్వారా పరిపాలన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యోగుల క్యాడర్‌ను పటిష్టం చేయాలని కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అర్చకుల కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నది తన ఆకాంక్ష అని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గొల్లపూడిలో ఉన్న భవనాన్ని అర్చకుల కోసం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. నలుగురు అర్చక ప్రతినిధులతో అర్చక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశామని, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్‌ను నెలకొల్పామన్నారు. ఇవి అర్చకుల నైపుణ్యాభివృద్ధికి దోహదపడతాయన్నారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ సిఫారసుల అనుసరించి అన్ని దేవాలయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు. అర్హత ఉన్న అర్చకులందరికీ కోడ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అర్చకులకు ఇళ్లపట్టాలు, గృహ నిర్మాణంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
కొత్తగా 20 జూనియర్, 10 డిగ్రీ కళాశాలలు
ఉన్నత విద్యకు తగిన సదుపాయాలు లేక సతమతమవుతున్న విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 20 జూనియర్ కళాశాలలను, 10 డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు.
జూనియర్ కళాశాలలు: అనంతపురం జిల్లా బెలగుప్ప, రాయదుర్గం, ముద్దిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా మళ్లనూరు, పలమనేరు, తూర్పు గోదావరి జిల్లా కేశనపల్లి, నెల్లిపాక, కడప జిల్లా కొండాపురం, కర్నూలు జిల్లా నాగులదినె్న, నంద్యాల, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, శ్రీకాకుళం జిల్లా గోవిందపురం, నివగాం, విశాఖ జిల్లా ఆనందపురం, లాలంకోడూరు, విజయనగరం జిల్లా గజపతినగరం, మెరకముడిదాం, పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెం
డిగ్రీ కళాశాలలు : చిత్తూరు జిల్లా కురబలకోట, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం, రాజమహేంద్రవరం, కిర్లంపూడి, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి, విశాఖ జిల్లా తగరపువలస, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పని చేయడం ప్రారంభిస్తాయి.
పింఛనుదారులకూ 20 శాతం ఐఆర్
పింఛనుదారులకు కూడా 20 శాతం మేర మధ్యంతర భృతి (ఐఆర్)ను ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బేసిక్ పింఛనుపై మధ్యంతర భృతి గత ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి నగదు రూపంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చెల్లిస్తారు. దీనిని చెల్లించేందుకు నిబంధనలను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.