ఆంధ్రప్రదేశ్‌

కుంచెలు కదిలాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 23: వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ చిత్రకారుల కుంచెలు క్యాన్ వాస్‌పై లయబద్ధంగా కదిలాయి. భావ స్పోరకమైన చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. కడప నగరంలోని యోగివేమన యూనివర్సిటీలో జరుగుతున్న మూడురోజుల ‘జాతీయ కళాశిబిరం’ ప్రముఖ చిత్రకారులు గీస్తున్న చిత్రాలతో నిండుదనం ఆపాదించుకుంది. యోగివేమన యూనివర్సిటీ లలితకళల విభాగం, రాష్ట్ర లలిత కళా అకాడమి, భారత ప్రభుత్వ కేంద్ర సాంస్కృతికశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాతీయ కళాశిబిరం నిర్వహించబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, గోవా, పాండిచ్చేరి తదితర ప్రాంతాల నుండి 15 మంది ప్రముఖ చిత్రకారులను ఎంపిక చేసి ఈ శిబిరానికి రప్పించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50 నుంచి 60 మంది చిత్రకారులతో సంప్రదించి, అంతిమంగా 16 మంది చిత్రకారులను ఈ జాతీయ కళాశిబిరానికి ఆహ్వానించారు. చిత్రకారుల పెయింటింగ్‌లు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. నిఘూఢ అర్థాలతో ఫైనార్ట్స్ విద్యార్థుల మెదడుకు పనిపెట్టాయి. మరికొన్ని చిత్రాలు రంగుల మేళవింపు తదితర సాంకేతిక అంశాలను తెలియచెప్పాయి. గోవాకు చెందిన సుప్రసిద్ధ చిత్రకారులు విరాజ్ నాయక్, విశాఖపట్టణానికి చెందిన చిత్రకారులు కె.రవి, తమిళనాడుకు చెందిన వి.సింగుట్టవన్, విశాఖకు చెందిన మరో చిత్రకారులు తమ్మినేని జగదీష్‌కుమార్, తెలంగాణకు చెందిన టైలర్ శ్రీనివాస్, పాండిచ్చేరికి చెందిన సెంజు, కేరళకు చెందిన ధను, గోవాకు చెందిన శ్రీజు తదితర ప్రముఖ చిత్రకారులు గీచిన పెయింటింగ్స్ ఫైనార్ట్స్ విద్యార్థినీ విద్యార్థులకు ఆ రంగంలో ఒక కొత్త బోధనలను నేర్పాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ అత్తిపల్లి రామచంద్రారెడ్డి కళాశిబిరాన్ని సందర్శించి ప్రతి ఒక్కరి పెయింటింగ్‌ను పరిశీలించారు. లలిత కళల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మృత్యుంజయరావు, పెయింటింగ్స్ వెనుకవున్న భావాలను వైస్ ఛాన్స్‌లర్‌కు వివరించారు.