ఆంధ్రప్రదేశ్‌

వైసీపీకి ఓటేస్తే.. మోదీ, కేసీఆర్‌కు వేసినట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 23: రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మోదీ, కేసీఆర్‌కు వేసినట్లే అవుతుందన్నారు. ఆ మూడు పార్టీల అజెండా రాష్ట్రానికి అన్యాయం చేయటమేనని, అలాంటి నేరస్తులతో తలపడుతున్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి శనివారం పార్టీ నేతలు, బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి తొలిదశ చర్చలు పూర్తయ్యాయని, అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు. సోమవారం నుంచి 60 మంది సమన్వయ కమిటీ సభ్యులతో భేటీ అవుతామన్నారు. ఎన్నికల సీజన్ కనుక పార్టీ విజయానికి అంతా కట్టుబడి ఉండాలని దిశానిర్దేశం చేశారు. గెలుపుతోనే గౌరవం, గుర్తింపు దక్కుతాయన్నారు. ఎవరిని ఎక్కడ పోటీలో నిలపాలో తనకు తెలుసని స్పష్టం చేశారు. రాయలసీమలో పార్టీకి ప్రజల నుంచి పూర్తి సానుకూలత ఉందన్నారు. సీమ చివరికంటా కృష్ణా జలాలను తరలించామని, ఊరూరా రైతులు జలసిరికి హారతులు పడుతున్నారని ఆయన చెప్పారు. రైతుల సానుకూలతే టీడీపీకి శుభ పరిణామమన్నారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని నిర్దేశించారు. ప్రజలు పెట్టిన పరీక్షలను నెగ్గామని, అద్భుత ఫలితాలు సాధించగలమనే ధీమా వ్యక్తం చేశారు. ఏ వర్గాలకు మేలుచేసిందీ ఆ వర్గం ప్రజలకు వివరించాలన్నారు. వ్యవసాయానికి చేసిన మేళ్లపై రైతులకు, నిరుద్యోగులకు భృతి, ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపనపై యువతలో ప్రచారం చేయాలన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మన పోరాటం కేంద్రం పైనే అని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ హయాంలో రాష్ట్రం కోసం పోరాడారని, అదే స్ఫూర్తితో తమ పోరాటం కొనసాగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. నాడు 161 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ వెన్నంటి నిలిచారని, మళ్లీ సీఎం చేశాకే పోరాటం విరమించారని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశం మొత్తం మనతోనే ఉందని, అండగా నిలుస్తోందని తెలిపారు. ఆరోజు, ఈరోజు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రే మహానాయకుడు సినిమా సారాంశమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే వినూత్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని వివరించారు. రాష్ట్రం కోసం విభేదాలు విస్మరించి పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని పిలుపిచ్చారు. గ్రూపుల పోరుకు స్వస్తి పలకాలని హితవు పలికారు. కడప, కర్నూలు జిల్లాల నేతలు ఐదు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నారని, అదే స్ఫూర్తితో మిగిలిన జిల్లాల నేతలు ముందుకు సాగాలన్నారు. జగన్‌ను కీలుబొమ్మగా వాడుకునేందుకే మోదీ, కేసీఆర్ పెట్టుబడులు పెడుతున్నారని విమర్శించారు. ఏపీకీ నష్టం కలిగించటమే ఆ మూడు పార్టీల అజెండా అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా దేశం ఇచ్చిన హామీ అని చెపుతూ పార్లమెంట్‌లో అన్ని పార్టీలు మనకు సంఘీభావం తెలిపాయని గుర్తుచేశారు. అయితే గత ఐదేళ్లుగా బీజేపీ ఆ హామీని తొక్కిపట్టి అణచివేతకు పాల్పడుతోందని ఆక్షేపించారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తిరుపతి సభలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని, తాము హోదా ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసొచ్చే పార్టీలకు మద్దతిస్తామన్నారు. వచ్చే నెల 1న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని విభజన హక్కులు, హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. హక్కులు నెరవేర్చాకే ఆయన ఈ గడ్డపై కాలుమోపాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలు పార్టీకి ప్రతిష్టాత్మకం కానున్నాయని, కార్యకర్తలు, నాయకులు పరస్పర సహకారం, సమన్వయంతో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.