ఆంధ్రప్రదేశ్‌

నాకిది పునర్జన్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 24:‘నాకిది పునర్జన్మ. మళ్లీ భార్యాబిడ్డల్ని చూస్తాననుకోలేదు. నా విడుదలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నా సంస్థకు చెందిన అధికారులు చూపిన చొరవ మరువరానిద’ని నైజీరియాలో కిడ్నాపర్ల చెరనుంచి విడుదలైన శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆదివారం వైజాగ్ చేరుకున్నారు. శ్రీనివాస్‌తోపాటు అవినాశ్ అనే మరో ఇంజనీర్‌ను కూడా నైజీరియాలో దుండగులు కిడ్నాప్ చేసి, 18 రోజులపాటు నిర్బంధించిన సంగతి తెలిసిందే. కాగా శ్రీనివాస్ విలేఖరులతో మాట్లాడుతూ ఆఫీసుకు వెడుతున్న తమను ముసుగు ధరించిన అగంతకులు కిడ్నాప్ చేశారని తెలిపారు. సుమారు నాలుగున్నర గంటల ప్రయాణం తర్వాత తమను ఒక ప్రాంతంలో బంధించారని, తాము కిడ్నాపర్ల చెరలో ఉన్న 18 రోజుల్లో మూడుసార్లు ప్రదేశాలను మార్చారని తెలిపారు. అయితే కిడ్నాపర్లు తమపై శారీరక దాడులకు పాల్పడలేదని చెప్పారు. కంపెనీ ప్రతినిధుల నుంచి డబ్బు డిమాండ్ చేశారని, వారి మాటల ద్వారా అర్థమైందన్నారు. తమకు అన్నం, పాలు ఇచ్చేవారని తెలిపారు. విడుదలయ్యే సందర్భంలో కిడ్నాపర్లు తమను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవచూపి నైజీరియా ప్రభుత్వంతోనూ, ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతోనూ చర్చించడం వల్లే తమ కిడ్నాప్ కథ సుఖాంతమైందన్నారు.

చిత్రం... కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన శ్రీనివాస్ తన పిల్లలతో..