ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక హబ్‌గా ఎపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 25: ఎపిని పరిశ్రమల హబ్‌గా తయారు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉపాధి, కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం ఇక్కడ మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకుగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ అందజేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా వస్తుందని, తద్వారా పరిశ్రమల స్థాపనకు రాయితీలు లభిస్తాయని ఇంతకాలం వేచి చూశామని, ఇంతవరకూ హోదా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించడానికి ముందుకు వచ్చిందన్నారు. సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసి అనుమతులు తర్వరితగతిన మంజూరు చేస్తామన్నారు. విశాఖలో జనవరిలో జరిగిన భాగస్వామ్య ఒప్పంద సదస్సులో కుదిరిన ఒప్పందాలలో 26 శాతం అమలు అయ్యాయన్నారు. ఇటీవల మలేషియాలో పర్యటించి ఆ ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన చర్చల మేరకు బయోటెక్నాలజీ రంగంలో 23 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని, తద్వారా 10 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదాపై సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.