ఆంధ్రప్రదేశ్‌

రాజన్న పాలన జగన్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, మార్చి 14 : మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు అద్భుత విజయం అందించాలని ప్రముఖ సినీనటుడు అలీ అన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్‌ఎస్‌ఆర్ కల్యాణ మండపంలో గురువారం వైసీపీ ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన అలీ మాట్లాడుతూ ఈ తరం, వచ్చే తరం భవిష్యత్ బాగుండాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజన్న పాలన రావాలంటే అది జగన్‌తో సాధ్యమన్నారు. పిట్ట కొంచెం.. కూత ఘనం.. ఆయనే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అంటూ ఛలోక్తులతో ఉత్సాహపరిచారు. మాట మీద నిలబడటం, మడమ తిప్పకపోవటం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబ లక్షణమని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసరంగా బాధితులను వైద్యశాలకు తరలించేందుకు ఉచితంగా 108 వాహనాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
దీంతో చాలామంది క్షతగ్రాతులను మృత్యువు నుంచి కాపాడారని అన్నారు. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని అన్నారు. అలాగే పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసి ఉచితంగా ఉన్నత విద్యను అందించిన మహానేత వైఎస్‌ఆర్ అని ప్రశంసించారు. మళ్లీ రాజన్న లాంటి ప్రభుత్వం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. జగన్ పాలనలోనూ ముస్లింలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
కావలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ముస్లిం జాతీయ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంఎ రెహమాన్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు అంజానీ హుస్సేన్, కావలి నియోజకవర్గ ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.