ఆంధ్రప్రదేశ్‌

హైదరాబాద్, ఢిల్లీలో అరకు కాఫీ హౌస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 14: నిన్న, మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమైన గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వ్యాపారాన్ని ఇక నుంచి దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా తదితర పట్టణాల్లో కాఫీ హౌస్‌లు, పెట్రోల్ బంక్‌ల నిర్వహణకు యాజమాన్యం కార్యాచరణ రూపొందించింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ రాజేంద్రనగర్, బొర్రాగుహలు ప్రాంతాల్లో కాఫీహౌస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
అలాగే రాజవొమ్మంగి, రౌతుగూడెం, దొరమామిడి, విశాఖ జిల్లా ఏజేన్సీ అన్నవరం, రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 32 మండల కేంద్రాల్లో ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను ఏర్పాటు చేయాలని, బాంబినో రిటైల్ ఔట్‌లెట్‌కు సంబందించి (ఎంఓయు) కుదర్చుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. వైజాగ్ సెంట్రల్ జైల్, శ్రీకాకుళం కలెక్టరేట్, నాబార్డు రూరల్ మార్ట్స్, మచిలీపట్నం ప్రాంతాల్లోను అరకు కాఫీ, జీసీసీ స్టాళ్ళను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనుంది. ఇవికాకుండా ఏపీలో ఏలూరు, శ్రీకాకుళం రైతుబజార్లలోను, వైజాగ్‌సిటీ సెంట్రల్‌పార్క్, లంబసింగి టూరిస్ట్ లోకేషన్, న్యూఢిల్లీ ఏపీ భవన్, న్యూఢిల్లీ శాస్ర్తీభవన్, న్యూఢిల్లీ సుప్రీంకోర్టు, రాజమండ్రి మునిసిపల్ పార్కుల వద్ద జీసీసీ అరకు కాఫీ స్టాళ్ళ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన మొబైల్ వాహనాలను పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించగలుగుతోంది. దాదాపు 25 రకాలైన అటవీ ఉత్పత్తులతో కూడిన మొబైల్ వాహనాల నిర్వహణను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజన తేనె, వేసవి తాపాన్ని తగ్గించి ఆరోగ్యానిచ్చే నన్నారి, బిల్వ షర్బత్‌లు, అరకుకాఫీ, అరకు టీ ప్యాకెట్లు, పలు రకాలైన జీసీసీ సబ్బులు, చింతపండు, షీకాయ, కుంకుళ్ళ షాంప్‌లు, పోషకాలను అందించే వేపిన జీడిపప్పు ప్యాకెట్లు, రకరకాల బిస్కట్లను జీసీసీ ఇపుడు అందుబాటులోకి తీసుకువస్తుంది.
వీటన్నింటిని జీసీసీ స్టాళ్ళల్లో ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి రూ.500కోట్లకు మించి వ్యాపార లక్ష్యాలను సాధించాలని నిర్ణయించిన జీసీసీ యాజమాన్యం అటవీ ఉత్పత్తులను పెంచుకుంటూ గిరిజన రైతులు, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకునే క్రమంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించగలుగుతున్నామని, ఏ విధమైన మధ్యవర్తిత్వం లేకుండానే గిట్టుబాటు ధరను కల్పించడం ద్వారా గిరిజన రైతులను ఆదుకోవాలనేది ప్రధాన లక్ష్యంగా జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ టీ.బాబునాయుడు ‘ఆంధ్రభూమి’కి గురువారం తెలిపారు. ఇప్పటికే పార్వతీపురం ఐటీడీఏ వద్ద కాఫీ హౌస్ నడుస్తోందని, జీ.మాడుగుల కొత్తపల్లి వాటర్‌పాల్స్, పాడేరు, పాతపట్నం నాబార్డు రూరల్ మార్ట్స్ ఆధ్వర్యంలో జీసీసీ స్టాళ్ళను ఏర్పాటు చేసామన్నారు. విజయవాడ, తిరుపతి రైతుబజార్ల వద్ద జీసీసీ ఔట్‌లెట్స్ ఏర్పాటయ్యాయన్నారు. ఏపీ రాజధాని అమరావతి సెక్రటేరియట్, విజయవాడ భవానీ ఐల్యాండ్, మంగళగిరి జీసీసీ రీజనల్ ఆఫీసు, చింతూరు ఐటీడీఏ ఔట్‌లెట్, విశాఖపట్నం విమానాశ్రయం తదితరచోట్ల జీసీసీ స్టాళ్లు, కాఫీహౌస్‌లకు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు.