ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వానికి రూ.350 కోట్ల విలువైన భూమి విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూలై 26: సుమారు రూ.350 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తున్నట్లు భూమి యజమాని మల్లెల అనంత పద్మనాభరావు తెలిపారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద విజయవాడ సబ్ కలెక్టర్ సృజనకు ప్రభుత్వానికి భూమిని ఇస్తున్నట్లు మంగళవారం విల్లింగ్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూమి యజమాని మల్లెల అనంతపద్మనాభరావు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి సంక్రమించిన పదెకరాల భూమి 350 కోట్ల రూపాయల విలువ చేస్తుందని చెప్పారు. ప్రజాప్రయోజనార్థం ఆ భూమిని అప్పగిస్తున్నట్టు అంగీకార పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సృజన, తహశీల్దార్ రియాజ్ బాషా, అనంత పద్మనాభరావు కుమారుడు శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు.
గొంతుకోసిన ఉన్మాది అరెస్టు..నిర్భయ కేసు
విజయనగరం(టౌన్), జూలై 26: సంచలనం సృష్టించిన యువతిపై ఉన్మాది కత్తితో గొంతు కోసిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘటనలో పరారైన నిందితుడు విక్రమ్‌ను సంఘటన జరిగిన 24 గంటల్లోపే అదుపులోకి తీసుకుని అతనిపై నిర్భయ చట్టం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తున్నట్లు విజయనగరం డిఎస్పీ ఎ.వి.రమణ వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తనతో పెళ్లి నిరాకరించినందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ముందుగా పోలీసులకు విషయం తెలిపి ఉంటే నిందితుని కదలికలపై నిఘా పెట్టి ఉండేవారమన్నారు. నిందితుడు బాధితురాలని హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఎస్‌కోట నుండి ఆటోలో బయలుదేరాడని, పట్టణంలోకి వచ్చాక కత్తికొని గాజలరేగ వెళ్లి బాధితురాలి తల్లిదండ్రుల ఎదుటే దాడిచేసి కత్తితో గౌతమిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని వివరించారు.
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 26: రాష్ట్రంలో నైరుతి రుతుపనాలు చుర్గుగా ఉండటంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావానికి తోడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. మరాట్వాడా, విదర్భ అనుకుని ఉన్న ప్రాంతం నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకూ సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం తాజాగా ఏర్పడింది. 24 గంటల్లో వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులుకురుస్తుందని తెలిపారు.