ఆంధ్రప్రదేశ్‌

విచారణకు సిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: వివేకానంద రెడ్డి అనుమానాస్పద మృతిపై వస్తున్న కథనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. వివేకానంద రెడ్డి హఠాన్మరణం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల అనుమానాలు రావడంతో స్పందించి, అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ఉండవల్లి ప్రజావేదిక వద్ద శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటిలిజెన్సు, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకానంద మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నియమించాలని ఆదేశించారు. ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో 5 సభ్యులతో సిట్‌ను డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ ఏర్పాటు చేశారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని, నిందితులు ఏ స్థాయివారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభలో, శాసనమండలిలో, లోక్‌సభలో ప్రజాప్రతినిధిగా ఆయన వ్యవహరించారని, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలు అందించారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.