ఆంధ్రప్రదేశ్‌

నేడు శ్రీవారి దర్శనం.. ఎన్నికల శంఖారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 15: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక పూర్తిచేసుకుని తిరుపతి నుంచి తొలి ఎన్నికల శంఖారావాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 9.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 9.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిధిగృహానికి చేరుకుంటారు. 11.15 గంటల నుంచి 11.45 గంటల్లోపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకుని 12 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 1 గంటకు తిరుపతిలోని తారకరామా స్టేడియం చేరుకుంటారు. ఇక్కడ బూత్ కమిటీ సభ్యులు, సంఘమిత్ర సభ్యులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు గంటల వరకు స్టేడియంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 3.10 గంటలకు సమావేశాన్ని ముగించుకుని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుని అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి
చేరుకుంటారు. 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. కాగా శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తారకరామ క్రీడా మైదానంలో జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వూకా విజయ్‌కుమార్, శాఫ్ డైరెక్టర్ శ్రీ్ధర్ వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, గంగమ్మ గుడి ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ ఆర్సీ మునికృష్ణ తదితరులు ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న నేపథ్యంలో జన సమీకరణపై పార్టీ నాయకులు దృష్టి సారించారు.