ఆంధ్రప్రదేశ్‌

బాబు కావాలో... జగన్ కావాలో ప్రజలే ఆలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: అంధకార ఆంధ్రప్రదేశ్ కావాలా.. కోతలు లేని విద్యుత్ అందించే చంద్రబాబు కావాలా అనే విషయమై రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. సోమవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్‌లో ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు వల్లే నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించగలుగుతున్నామన్నారు. 2004- 2014 మధ్య నాణ్యమైన విద్యుత్ సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల రైతులు, పారిశ్రామిక వేత్తలు, చిరు వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆ సమయంలో విద్యుత్ కోతల వల్ల ప్రజలు కష్టాలు, నష్టాలు చవి చూశారని దినకర్ తెలిపారు. ప్రజల జీవనంతో పెనవేసుకుపోయిన విద్యుత్ నిర్వహణలో అప్పటి ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు చీకట్లో పాము కాట్లకు గురయ్యారని, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ఎన్నో కుటీర, లఘు, భారీ పరిశ్రమలు కోతలతో మూతపడ్డాయని రాష్ట్రంలో యువతకు ఉపాధి కరువయ్యిందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగిందన్నారు. అయినప్పటికీ 2014 తరువాత వంద శాతం 24 ఇంటలు నాణ్యమైన, కోతలులేని విద్యుత్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రణాళికలు రచించి విద్యుత్ ఉత్పత్తిని పెంచారన్నారు.