ఆంధ్రప్రదేశ్‌

సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం పెదకోడాపల్లిలో జరిగిన పోలీసు కాల్పులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం పెదకోడాపల్లిలో కూంబింగ్‌లో అమాయక గిరిజనులైన బట్టి భూషణం (52), సీదరి దమంధర్ (32) తమ పంటల రక్షణ కోసం కాపలా కాసేందుకు వెళ్లి, నాటు తుపాకులతో తిరిగి వస్తుండగా మావోయిస్టులని పొరబడి పోలీసులు కాల్పులు జరిపి ఎన్‌కౌంటర్ చేశారని, ఇది తీవ్రమైన నేరమని, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబానికి కోటి రూపాయలు చొప్పున పరహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మధు డిమాండ్ చేశారు.