ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా ‘టెన్త్’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 18: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3వరకు పరీక్షలు జరుగనున్నాయి. రాష్టవ్య్రాప్తంగా ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 2839 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 6,20,733 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,623 గైర్హాజరయ్యారు. మొత్తంగా మొదటి రోజు 99.57 శాతం హాజరు నమోదైంది. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు ఇన్విజిలేటర్‌లను విశాఖపట్నం జిల్లాలో సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు సుబ్బారెడ్డి తెలిపారు. తూర్పుగోదావరిజిల్లాలో ఒకరిని, కడప జిల్లాలో ఇద్దరిని విధుల నుండి తొలగించినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 289 సిట్టింగ్ స్క్వాడ్‌లు నియమించామని, 209 సమస్యాత్మకమైన పరీక్షా కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో వౌలిక వసతులు కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
చిత్రం.. విజయవాడలోని ఒక కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి