ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ తుది జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 19: తెలుగుదేశం పార్టీ తుది జాబితా విడుదల చేసింది. 25 లోక్‌సభ స్థానాలతో పాటు పెండింగ్‌లో ఉన్న 34 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.

లోక్‌సభ అభ్యర్థులు
*
1. శ్రీకాకుళం - కె.రామ్మోహన్ నాయుడు
2. విజయనంగరం- అశోక్ గజపతిరాజు
3. విశాఖపట్నం - ఎం భరత్
4. అనకాపల్లి - అడారి ఆనంద్
5. అరకు - కిషోర్ చంద్రదేవ్
6. కాకినాడ - చలమలశెట్టి సునీల్
7. అమలాపురం- గంటి హరీష్
8. రాజమండ్రి - మాగంటి రూప
9. నరసాపురం - వి శివరామరాజు
10. ఏలూరు - మాగంటి బాబు
11. మచిలీపట్నం - కొనకళ్ల నారాయణ
12. విజయవాడ - కేశినేని నాని
13. గుంటూరు - గల్లా జయదేవ్
14. నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు
15. బాపట్ల - శ్రీరాం మాల్యాద్రి
16. ఒంగోలు - శిద్దా రాఘవరావు
17. నెల్లూరు - బీదా మస్తాన్‌రావు
18. కడప - ఆదినారాయణరెడ్డి
19. రాజంపేట - డి. సత్యప్రభ
20. నంద్యాల - శివానందరెడ్డి
21. కర్నూలు - కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
22. అనంతపూర్ - జెసి పవన్ రెడ్డి
23. హిందూపూర్ - నిమ్మల కిష్టప్ప
24. తిరుపతి - పనబాక లక్ష్మి
25. చిత్తూరు - శివప్రసాద్
*
శాసనసభ అభ్యర్థులు
విజయనగరం జిల్లా
1. నెల్లిమర్ల - పతివాడ నారాయణ స్వామి
2. విజయనగరం- అదితి గజపతిరాజు
విశాఖపట్నం జిల్లా
3. భీమిలి - సబ్బం హరి
4. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
5. చోడవరం - కలిదిండి సన్యాసి రాజు
6. మాడుగుల - గవిరెడ్డి రామానాయుడు
7. పెందుర్తి - బండారు సత్యనారాయణ మూర్తి
తూర్పుగోదావరి
8. అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు
పశ్చిమ గోదావరి
9. నిడదవోలు - బూరుగుపల్లి శేషారావు
10. నరసాపురం- బండారు మాధవనాయుడు
11. పోలవరం - బి. శ్రీనివాసరావు
గుంటూరు జిల్లా
12. తాడికొండ - తెనాలి శ్రావణ్‌కుమార్
13. బాపట్ల - అన్నం సతీష్ ప్రభాకర్
14. నరసరావుపేట- డాక్టర్ అరవింద బాబు
15. మాచర్ల - అంజిరెడ్డి
ప్రకాశం జిల్లా
16. దర్శి - కదిరి బాబురావు
17. కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
నెల్లూరు జిల్లా
18. కావలి - విష్ణువర్ధన్ రెడ్డి
19. నెల్లూరు (రూరల్)- అబ్దుల్ అజీజ్
20. వెంకటగిరి - కె రామకృష్ణ
21. ఉదయగిరి - బొల్లినేని రామారావు
కర్నూలు జిల్లా
25. కర్నూలు- టీజీ భరత్
26. నంద్యాల - భూమా బ్రహ్మానందరెడ్డి
27. కోడుమూరు- బి రామాంజనేయులు
అనంతపురం జిల్లా
28. గుంతకల్ - ఆర్ జితేంద్రగౌడ్
29. సింగనమల - బండారు శ్రావణి
30. అనంతపురం అర్బన్- ప్రభాకర్ చౌదరి
31. కళ్యాణ్‌దుర్గం - ఉమామహేశ్వర నాయుడు
32. కదిరి - కందికుంట వెంకట ప్రసాద్
చిత్తూరు జిల్లా
33. తంబళ్లపల్లె - శంకర్ యాదవ్
34. సత్యవేడు - జెడి భాస్కర్
35. గంగాధర నెల్లూరు- హరికృష్ణ
36. పూతలపట్టు - తెర్లం పూర్ణం
కడప జిల్లా
22. కడప - అమీర్‌బాబు
23. కోడూరు - నరసింహ ప్రసాద్
24. ప్రొద్దుటూరు- లింగారెడ్డి
లోక్‌సభ స్థానాల్లో కొందరు సిటింగ్‌ల మార్పుతో పాటు శాసనసభ స్థానాలకు తుది జాబితాలో కొత్తవారిని ఎంపిక చేశారు. మంత్రులు శిద్దా రాఘవరావు ఒంగోలు, ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన మాజీ కేంద్రమంత్రులు పనబాక లక్ష్మికి తిరుపతి, కిషోర్‌చంద్రదేవ్‌కు అరకు లోక్‌సభ అభ్యర్థులుగా అవకాశమిచ్చారు. సిట్టింగ్ ఎంపీలలో రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, శ్రీరాం మాల్యాద్రి, శివప్రసాద్ బరిలో ఉన్నారు. కాగా శాసనసభ స్థానాలకు పూర్తి స్థాయిలో వడపోత అనంతరం అభ్యర్థులను ప్రకటించారు.