ఆంధ్రప్రదేశ్‌

లోక్‌సభకు 19 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు సంబంధించి బుధవారం 19 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో విజయనగరం లోక్‌సభ స్థానానికి టీడీపీ తరపున అశోక్ గజపతిరాజు, సునీలా గజపతి రాజు, రాజమండ్రికి సంబంధించి టీడీపీ నుంచి రూప రామ్మోహన్ మాగంటి, నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి వైకాపా తరపున కనుమూరు రఘు రామకృష్ణంరాజు, నంద్యాలకు టీడీపీ తరపున మాండ్ర శివానంద రెడ్డి, అనంతపురానికి సంబంధించి జేసీ పవన్ రెడ్డి, రాజంపేటకు వైకాపా నుంచి పివి మిధున్ రెడ్డి, చిత్తూరు ఎస్సీకి సంబంధించి టీడీపీ తరపున ఎన్.శివప్రసాద్ ఉన్నారు.