ఆంధ్రప్రదేశ్‌

వైసీపీలోకి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, మార్చి 20: కడప జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన అనుచరులతో రెండు మూడు రోజుల్లో సమావేశమై జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు డీఎల్‌ను వైకాపాలో చేరాల్సిందిగా పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి ఆహ్వానించారు. బుధవారం ఖాజీపేటలో డీఎల్‌ను కలిసి పార్టీలో చేరాలని జగన్ ఆహ్వానించారని చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించిన డీఎల్ అనుచరులతో మాట్లాడి పార్టీలో చేరతానన్నారు. తన మిత్రుడు రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహనరెడ్డికి మద్దతు ఇస్తానన్నారు. త్వరలో పార్టీలో చేరి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు.