ఆంధ్రప్రదేశ్‌

పోలీసు తనిఖీల్లో అర కోటి నగదు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లప్రోలు, మార్చి 20: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు శివారులోని టోల్‌గేటు వద్ద కారులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదును బుధవారం తనిఖీల సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న నగదు తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కు చెందినదిగా ఆధారాలు చూపడంతో విచారణ అనంతరం విడిచిపెట్టారు. వివరాలిలావున్నాయి... గొల్లప్రోలు శివార్లలోని జాతీయరహదారి టోలుగేటు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈసందర్భంగా కాకినాడ నుండి వస్తున్న ఒక కారులో రూ.50 లక్షల నగదును గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై బి రామకృష్ణ, నగర పంచాయతీ కమిషనర్ పి సాయిబాబు, ఇతర ఎన్నికల సిబ్బంది అక్కడకు చేరుకొని నగదు తరలింపుపై ఆరాతీశారు. కారులో నగదు తరలిస్తున్న కాకినాడ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ కేఏ రామకృష్ణరాజు, మెసెంజర్ బీవీ రామకృష్ణ, కారు డ్రైవర్ డి కామేశ్వరరావులను ఎస్సై రామకృష్ణ విచారించారు. డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తుండటం, నగదు ఏలేశ్వరం బ్రాంచీకి వెళుతుండటంతో అధికారుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే నగదుకు సంబంధించి బ్యాంకు మేనేజర్ రామకృష్ణరాజు తగిన ఆధారాలు చూపడంతో స్టేట్‌మెంటు రికార్డు చేసుకుని నగదుతోపాటు కారును పంపించి వేశారు.

చిత్రం..కారు డిక్కీలో ఉంచిన నగదు