ఆంధ్రప్రదేశ్‌

హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, మార్చి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో బుధవారం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఈ సభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రంలో అనేక రాజకీయ హత్యలు జరిగాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా చంద్రబాబునాయుడు ప్రోద్భలంతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. ఈవిషయంగా తనపై టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో నియమించిన పోలీస్ యంత్రా ంగం కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగానే విచారణ చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. టీడీపీ పాలనలో కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణరెడ్డి హత్య, అనంతపురంలో తహశీల్దార్ కార్యాలయంలోనే ప్రసాద్‌రెడ్డి హత్య, తాడిపత్రిలో విజయభాస్కర్‌రెడ్డి హత్యతో పాటు అనేకమంది వైసీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారన్నారు. గతంలో వంగవీటి రంగ, రాఘవేంద్రరావు, దశరధ్‌లను హత్య చేయించిన ఘనత కూడా వీరికే దక్కిందన్నారు. ఎన్నికలు వస్తేనే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలన్ని పూర్తిగా విస్మరించి ప్రజలను దగా చేశారన్నారు. రైతులను రుణమాఫీతో నట్టేట ముంచారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ రైతులకు వడ్డీకి కూడా సరిపోలేదన్నారు. నేడు ప్రభుత్వ విధానాల వల్ల పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసి నేడు కల్లబొల్లి మాటలతో మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 45 సంవత్సరాల వారికి పింఛన్లు అందిస్తామన్నారు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు మూడు వేల రూపాయల వంతున పింఛన్లు అందిస్తామని తెలిపారు.
టీడీపీ పాలనలో మత్స్యకారులకు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు విలువ లేకుండా పోయిందన్నారు. జన్మభూమి కమిటీల పేరిట టీడీపీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్లు ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం సొంతంగా ఏర్పరచుకున్న సామ్రాజ్యంలో అక్రమ కార్యక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్‌ను కొట్టి ఎమ్మెల్యేలాంటి వ్యక్తికి తిరిగి పార్టీపరంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డువచ్చిన వారందరినీ సొంత సామ్రాజ్యంతో అంతమొందిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా వైకాపా అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పలమనేరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వెంకటేష్‌గౌడ, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి రెడ్డెప్ప, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్రం..పలమనేరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్