ఆంధ్రప్రదేశ్‌

మై వోట్ క్యూ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ల పరిస్థితిని తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల సంఘం ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మైవోట్‌క్యూ పేరుతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసి, ఆండ్రాయిడ్ ఫోన్లలో వినియోగించేలా అభివృద్ధి చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేసేందుకు చాలా సేపు ఎండలో క్యూలో నిలబడాల్సి వస్తుండటంతో ఎక్కువ మంది ఓటు వేసేందుకు రావడం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎక్కువ క్యూ ఉంటే ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం అభివృద్ధి చేసింది. క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్‌లో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లపరిస్థితి తెలుసుకోవచ్చు. గతంలో ఓటరుకు టోకెన్ జారీ చేసి, ఒక నిర్ణీత సమయంలో ఓటు వేసేలా ప్రతిపాదన వచ్చింది. కానీ దాని వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆ ప్రతిపాదన విరమించుకుంది. ఈ యాప్ సాయంలో రద్దీ తక్కువగా ఉన్న సమయం తెలుసుకుని ఓటు వేసేందుకు వెళ్లే వీలు కలుగుతుంది. దీని వల్ల ఓటరు విలువైన సమయం ఆదా అవుతుంది.