ఆంధ్రప్రదేశ్‌

హోలీ వేడుకల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, మార్చి 21: హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. రెండు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒంటికి అంటుకున్న రంగులను కడుక్కోవటానికి పట్టణానికి సమీపంలోని బాహుదా నదిలో దిగిన ఇద్దరు బాలురు నీట మునిగి మరణించారు. వీరిద్దరూ స్నేహితులు కావటంతో మరణంలోనూ బంధం వీడలేదని స్థానికులు కంటతడి పెట్టారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని దానంపేటకు చెందిన నగరపల్లి మోహనరావు, ఈశ్వరి కుమారుడు జితిన్, బాసుదేవ క్వార్టర్స్‌కు చెందిన కాళ్ల హరి, అరుణ కుమారుడు స్నేహిత్ జ్ఞానభారతి పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు. గురువారం హోలీ సందర్భంగా స్థానికులు, స్నేహితులతో కలిసి రంగులు చల్లుకున్నారు. తర్వాత ఉత్తరాయణం పాతాళ సిద్ధేశ్వర స్వామి ఆలయ సమీపాన బాహుదా నదిలో స్నానానికి వెళ్లారు. నదిలో గోతులుండటంతో నీట మునిగారు. విషయాన్ని తోటివారు ఫోన్‌లో చెప్పడంతో 15వ వార్డు టీడీపీ నేత నందిగాం కోటిసహా పలువురు పరుగు తీశారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. మృతుల తల్లులు సొమ్మసిల్లిపడిపోవటంతో వైద్యులు చికిత్స అందించారు. పట్టణ పోలీసులు పంచనామా నిర్వహించారు. డాక్టర్ పి.శ్రీనివాస్ పోస్ట్‌మార్టం చేశాక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్నేహిత్ తండ్రి హరి సప్లయర్స్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్నేహిత్ ఒక్కడే కుమారుడు. కుమార్తె సుకీర్తి ఇంజినీరింగ్ చదువుతోంది. జితిన్ తండ్రి మోహనరావు ఒడిశాలోని సున్నాపురంలో ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. వీరికి కూడా జితిన్ ఒక్కడే కుమారుడు. కుమార్తె భువనేశ్వరి డిగ్రీ చదువుతూ డ్యాన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థుల మృతి పట్ల జ్ఞానభారతి సీఈవో జోహర్‌ఖాన్, ప్రిన్సిపాల్ పండా, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.