ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రా మహిళలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 22: రాష్ట్ర విభజన తరువాత నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ విశిష్టమైన ప్రణాళికలు రూపొందించినట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉదయం నగరంలోని పీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రధానిగా రాహుల్‌గాంధీ మొదటి సంతకంతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలుచేయనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర నిధులతో సంబంధం లేకుండా మొత్తం కేంద్రం నిధులతోనే జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చి రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు 2లక్షల రుణమాఫీ చేయడమే కాకుండా వారి ఆర్థిక అభ్యున్నతికి వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా ప్రకాశం జిల్లాకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని అమలుచేస్తామని తెలిపారు. సమాజంలో విద్యా, వైద్యం విషయంలో ఇష్టారాజ్యంగా ఉన్న కార్పొరేట్ రంగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి వారి ఆగడాలను అదుపు చేస్తామన్నారు. ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తామన్నారు.
పెట్రల్, డీజిల్ ధరల నియంత్రణకు వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తెస్తామని, చేనేత రంగాన్ని జీఎస్‌టీ పరిధి నుంచి మినహాయిస్తామని రఘువీరా తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులను తెచ్చి 5లక్షల వరకూ ఉచిత వైద్యం, చికిత్స అందిస్తామన్నారు. ప్రతి నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 4 వంట గ్యాస్ సిలెండర్ల సరఫరా, సంక్షేమ పథకాల అమలులో బయోమెట్రిక్ విధానం రద్దు, దళిత క్రైస్తవులను, రజకులను, వడ్డెరలను ఎస్సీలుగా, వాల్మీకీ, మత్యకారులను ఎస్టీలుగా గుర్తింపు, ఎస్సీ, ఎస్టీ సబ్ తరహాలోనే మైనార్టీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ వంటి నకిలీ సంస్థల బాధితులకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర అంశాల మేనిఫెస్టోతోపాటు స్థానిక ప్రజల ఆకాంక్షల కనుగుణంగా రాష్ట్రంలోని 13జిల్లాలకు చెందిన అభివృద్ధి అంశాలపై జిల్లాల వారీగా ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కో చైర్మన్ షాజహాన్ బాషా, కన్వీనర్ డాక్టర్ జీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.