ఆంధ్రప్రదేశ్‌

బాబు అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిశారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం అక్రమాల గురించి సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. గెలుపుకోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఏపీ డీజీపీ ఠాకుర్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటిలిజెన్స్ విభాగం ఐజీ వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు యోగానంద్, విక్రాంత్ పాటిల్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అరోరా
దృష్టికి తెచ్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీసు విభాగంలో దాదాపుగా 37 మంది అధికారులకు పదోన్నతి కల్పించారని ఆయన ఆరోపించారు. అలాగే సూపర్ న్యూమరీ ద్వారా కొంతమంది అధికారులను ఎలివేట్ చేశారని మరోసారి ఈసీకి వివరించినట్టు విజయసాయి వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఎస్పీలుగా నాన్ క్యాడర్ ఆఫిసర్లను ఈ ప్రభుత్వం నియమించిందని ఆయన చెప్పారు. పోలీసుల సాయంతో డబ్బును ఓటర్లను పంచేందుకు వీలుగా తగిన బందోబస్తును ఏర్పాటు చేసి తరలిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలోని నారాయణ కళాశాల నుంచి కారులో డబ్బు తరలిస్తుండగా తాహశీల్‌దార్ పట్టుకున్నారని ఈసీకి తెలిపారు. చివరికి ఎన్నికల సామాగ్రి మాత్రమే ఉందని అధికారులు తప్పించారని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు అనుసరిస్తున్న విధానాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకుల పోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలతో సహా సునీల్ అరోరాకు సమర్పించామని అన్నారు. కాగా ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలీకాప్టర్ రెక్కలు వైస్సార్‌సిపి గుర్తు ఫ్యానుతో పోలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ గుర్తును మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ప్రజాశాంతి పార్టీ కండువా కూడా తమ పార్టీలాగానే మూడు రంగుల కలిగి ఉందని ఈసీకి వివరించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనైతిక సయోధ్య వల్లనే కేఏ పాల్ మోసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలపై సోమవారం 4 గంటలకు మరోసారి ఈసీ ఉన్నతాధికారులతో సమావేశమై వివరిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు.