ఆంధ్రప్రదేశ్‌

పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, మార్చి 22: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టులు పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులను మంగళవారం హతమార్చారు. వివరాలిలావున్నాయి. సుకుమా జిల్లా సోలంపల్లి గ్రామానికి చెందిన కిచ్చే ముక్కా (42) పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా మావోయిస్టులు కత్తులతో దాడిచేసి హతమార్చారు. ముక్కా గతంలో మావోయిస్టులను ఏరివేసేందుకు ఏర్పడిన సల్వాజుడుంలో పనిచేశాడు. సుకుమ జిల్లాలోని చిందుగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోకెల్ గ్రామానికి చెందిన ముచ్చిక సోనా (40)ను మంగళవారం తెల్లవారు ఝామున మావోయిస్టులు ఇంటికి వెళ్లి తమతోపాటు అడవికి తీసుకెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి, గొడ్డలితో నరికి హతమార్చారు.
దొరలతాడి వలసలో గిరిజనుడి హత్య
సాలూరు: పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని దొరలతాడివలస గ్రామ సమీపాన ఒక గిరిజనుడిని మంగళవారం రాత్రి మావోయిస్టులు హత్య చేసినట్లు తెలిసింది. కూపూడి వెంకటరావు (35) అనే గిరిజన వ్యాపారిని పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మావోలు హతమార్చారు. ఈ సంఘటనతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఆందోళన నెలకొంది.

ఇసుక అక్రమ తరలింపునకు చెక్!
ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులో పోలీస్ అవుట్ పోస్టు
విజయపురిసౌత్, మార్చి 22: ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నాగార్జున సాగర్‌లోని టీ జంక్షన్‌లో మంగళవారం పోలీస్ అవుట్ పోస్టును విజయపురిసౌత్ ఎస్‌ఐ కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ అవుట్ పోస్టులో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, ఇద్దరు హోంగాడ్‌లు 24 గంటలు పర్యవేక్షిస్తారన్నారు.
ఇసుక అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుకను కొందరు తమకు అనుకూలంగా మలుచుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పోస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి సరుకు రవాణా అయ్యేటప్పుడు తప్పని సరిగా బిల్లులు, ట్యాక్స్ చెలానాలు ఉండాలన్నారు.