ఆంధ్రప్రదేశ్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి చర్చ జరిపేందుకు సిద్ధమని సినీ నటుడు మోహన్‌బాబుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ చేశారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మోహన్‌బాబుకు చెందిన వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు 2014-15 నుంచి ఐదేళ్లలో 95 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, 88.57 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడవ త్రైమాసికం వరకూ కేవలం 4.53 కోట్ల రూపాయల మేర మాత్రమే బకాయిలు ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా ఆ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. సమాజంలో హోదా కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రిపై తప్పుడు విమర్శలు చేయడం మోహన్‌బాబు విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. తాను వెల్లడించిన వివరాల్లో అవాస్తవాలు ఉండే ప్రజల ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని, లేకపోతే మోహన్‌బాబు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.