ఆంధ్రప్రదేశ్‌

మోహన్‌బాబు గృహ నిర్బంధం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబును హౌస్ అరెస్టు చేయడాన్ని భాజపా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. తన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న రూ.19 కోట్లు వెంటనే విడుదల చేయాలని మోహన్‌బాబు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వమే కావాలని ఉద్దేశ్యపూర్వకంగా చెల్లించలేదన్నారు. తనకు మద్దతు తెలపనందుకే మోహన్‌బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ కళాశాలకు రావాల్సిన రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించకుండా ముఖ్యమంత్రి నిలిపివేశారని ఆరోపించారు. పైగా తన విద్యార్థులు, కుమారులతో కలసి తిరుపతిలో నిరసనకు దిగిన మోహన్‌బాబును హౌస్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. మోహన్‌బాబును వెంటనే విడుదల చేయాలని, ఆయన విద్యాసంస్థలకు చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్ మొత్తం రూ.19 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.