ఆంధ్రప్రదేశ్‌

31 కేసులున్న జగన్ సీఎం పదవికి ఎలా అర్హుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు తనకు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని, 31 కేసులున్న జగన్ ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హుడవుతారని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఇదేమైనా పేకాటా... ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు అన్నారు. శనివారం మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కుంచనపల్లి, మెల్లెంపూడి, పాతూరు తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల అఫిడవిట్‌లోనే తనపై 31 కేసులు ఉన్నాయని జగన్ పేర్కొన్నారని, ఆయనకున్నదంతా నేరచరిత్రేనని, పాలనానుభవం సున్నా అని ఎద్దేవాచేశారు. లోటుబడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను సమర్థవంతంగా పాలిస్తున్న చంద్రబాబే మళ్లీ రావాలని జనమే కోరుకుంటున్నారని తెలిపారు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం చేపట్టిన చంద్రన్న దేశమంతా మన రాష్ట్రంవైపు చూసేలా చేశారని పేర్కొన్నారు. కియా కార్ల పరిశ్రమ, అపోలో టైర్స్, ఫాక్స్‌కాన్ మొబైల్స్ వంటి తయారీ పరిశ్రమలను ఎన్నో తీసుకువచ్చారని తెలిపారు. దీంతో వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ఐటి శాఖ మంత్రిగా తాను మంగళగిరికి పలు కంపెనీలను తీసుకువచ్చానని, తనను గెలిపిస్తే మంగళగిరిని మరో గచ్చిబౌలిగా మారుస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశానని, అన్నింటినీ పరిష్కరించేందుకు పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధంచేశామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి, పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.