ఆంధ్రప్రదేశ్‌

జగన్ అఫిడవిట్ తప్పుల తడక: వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి పులివెందులలో ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ మొత్తం తప్పుల తడక, వాస్తవాలకు దూరంగా ఉందని, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య పేర్కొన్నారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్‌లో రామయ్య మాట్లాడారు. జగన్ ఇచ్చిన అఫివిట్‌లో 31 కేసులు ఉన్నాయని, అవన్నీ విచారణలో ఉన్నాయని తెలియజేశారన్నారు. జగన్‌పై ఉన్నన్ని కేసులు దేశంలో ఏ నాయకుడినైనా లేవని, ఉత్తర భారతదేశంలోని పప్పుయాదవ్‌పై కూడా 29 కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. నేర చరిత్ర ఉన్న జగన్ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు వేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. 2004 అఫిడవిట్‌లో జగన్ ఆస్తుల విలువ 1.73 కోట్లు అని, 2019 నాటికి 339.89 కోట్లుగా చూపారని, ఇంత తక్కువ వ్యవధిలో 1100 శాతం ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలకు వివరించాలన్నారు. 2009 ఎన్నికల్లో 2.19 కోట్లుగా అఫిడవిట్‌లో చూపారని, 2014లో 321 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారన్నారు. టాటా, బిర్లా వంటి పారిశ్రమిక వేత్తలకు కూడా ఆస్తులు ఇంతపెద్ద ఎత్తున పెరగలేదని, ఇవన్నీ అవినీతి ఆస్తులు కాదా అని రామయ్య ప్రశ్నించారు.