ఆంధ్రప్రదేశ్‌

దొంగలకు కాపలాదారుడు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం/రేపల్లె, మార్చి 23: ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దొంగలు, దోపిడీదారులకు కాపలాదారుడిగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి, చంద్రబాబు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదిగా మారిన నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చర్యలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన కృష్ణాజిల్లా నాగాయలంక, గుంటూరు జిల్లా రేపల్లె సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లుగా అందరి సంక్షేమాన్ని చూసిన తనకు ప్రజలు ఓటు ద్వారా రుణం తీర్చుకునే సమయం అసన్నమైందన్నారు. ఏప్రిల్ 11వతేదీన జరిగే ఎన్నికల్లో తమను మరోసారి గద్దెనెక్కించాలని కోరారు. అభివృద్ధికి ఓటు వేస్తారో, దోపిడీదారులకు ఓటు వేస్తారో తేల్చుకోవల్సిన సమయం వచ్చిందన్నారు. 2019 ఎన్నికలు చరిత్రకు నాంది కావాలని పిలుపునిచ్చారు. నామినేషన్ల సమయంలో తామంతా అఫిడవిట్ ద్వారా ఆస్తులు వివరిస్తే ప్రతిపక్ష జగన్ మాత్రం తన నేర చరిత్రను 45 పేజీల రూపంలో తెలియచేశారన్నారు. దీని బట్టి జగన్ ఎంత నేర చరిత్ర కలిగిన వ్యక్తో ప్రజలు ఆలోచించాలన్నారు. న్యాయబద్ధంగా మన రాష్ట్రానికి రావల్సిన లక్ష కోట్లకు ఎగనామం పెట్టేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్‌తో చేతులు కలిపాడన్నారు. సెంటిమెంట్‌తో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్‌కు తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే శక్తి ఉందా అని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్పించుకుంటే ఖబడ్దార్...కేసీఆర్ అంటూ హెచ్చరించారు. విభజన సమయంలో కాంగ్రెస్‌కు పట్టినగతే నేడు వైసీపీకి పడుతుందని అందుకు రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం కాపాడుకునేందుకు ఒకేపక్షంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత డబ్బు చెల్లించి పార్లమెంటేరియన్ అవార్డు దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో 9లక్షల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించి విఫలం కాగానే పారిపోయారన్నారు. తెలంగాణలో కేసీఆర్ 25లక్షల ఓట్లు తీసివేయించి ఎన్నికలలో గెలిచి, మిగిలిన ఎమ్మెల్యేలను కూడా డబ్బుతోకొని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశాడని విమర్శించారు. అక్రమంగా కాజేసిన వాన్‌పిక్ భూములను కేసీఆర్‌కు జగన్ గిఫ్టుగా ఇస్తాడట అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం మరోమారు రాగానే వైసీపీ ఆనవాలు కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ సభల్లో మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి బుద్ధప్రసాద్, మంత్రి కొల్లు రవీంద్ర, బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్ధి శ్రీరామ్ మాల్యాద్రి, రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్, మంత్రి ఆనందబాబు, బాపట్ల అభ్యర్థి సతీష్‌ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.