ఆంధ్రప్రదేశ్‌

ప్రస్తుత ఓటర్లు 3,91,81,399 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: రాష్ట్రంలో శనివారం నాటికి 3 కోట్ల 91 లక్షల 81వేల 399 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ అనంతరం తుది జాబితా విడుదల చేయనుంది. తుది జాబితా ముగిసేలోగా మరో మూడు లక్షలు పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళంలో 21లక్షల 70వేల 802 మందికి గాను 10లక్షల 86వేల 291 మంది పురుషులు, 10లక్షల 84వేల 240 మంది మహిళలు ఉన్నారు. విజయనగరంలో 18లక్షల 17వేల 635 మందికి గాను పురుషులు 8లక్షల 98వేల 79, మహిళలు 9లక్షల 19వేల 428, విశాఖపట్నంలో 35లక్షల 74వేల 246కు గాను పురుషులు 17లక్షల 73వేల 506, మహిళలు 18వేల 545, తూర్పు గోదావరిలో 42లక్షల 4వేల 35 మందికి గాను పురుషులు 20లక్షల 80వేల 555, మహిళలు 21లక్షల 23వేల 127, పశ్చిమలో 32లక్షల 6వేల 496కు గాను పురుషులు 15లక్షల 75వేల 913, మహిళలు 16లక్షల 30వేల 286, కృష్ణా జిల్లాలో 35లక్షల 7వేల 460కు గాను పురుషులు 17లక్షల 27వేల 80, మహిళలు 17లక్షల 80వేల 106, గుంటూరులో 39లక్షల 62వేల 143 మంది ఓటర్లకు గాను 19లక్షల 37వేల 013, మహిళలు 20లక్షల 24వేల 668 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 26లక్షల 28వేల 449 మందికి గాను 13లక్షల 6వేల 241 మంది పురుషులు, 13లక్షల 22వేల 56 మంది మహిళలు, నెల్లూరు జిల్లాలో 23లక్షల 82వేల 114 మందికి గాను 11లక్షల 67వేల 913 మంది పురుషులు, 12లక్షల 13వేల 830 మంది మహిళలు, కడపలో 21లక్షల 92వేల 158 మంది ఓటర్లు ఉండగా 10లక్షల 80వేల 998 మంది పురుషులు, 11లక్షల 10వేల 863 మంది మహిళలు, కర్నూలు జిల్లాలో 31లక్షల 42వేల 322 మందికి గాను 15లక్షల 60వేల 317 మంది పురుషులు, 15లక్షల 81వేల 478 మంది మహిళలు అనంతపురంలో 32లక్షల 14వేల 438 మందికి గాను 16లక్షల 12వేల 983 పురుషులు, 16లక్షల 1208 మంది మహిళలు, చిత్తూరు జిల్లాలో 31లక్షల 79వేల 101 మంది ఓటర్లకు గాను 15లక్షల 75వేల 179 మంది పురుషులు, 16లక్షల 3వేల 588 మంది మహిళలు ఉన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇప్పటి వరకు కోటీ 93లక్షల 82వేల 68 మంది పురుష ఓటర్లు ఉంటే కోటీ 97లక్షల 95వేల 423 మంది మహిళలు, 3908 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు.