ఆంధ్రప్రదేశ్‌

పార్టీలు, అభ్యర్థులు కాదు.. ప్రజలు గెలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 23: ఎన్నికల్లో గెలవాల్సింది రాజకీయ పార్టీలు, వాటి తరపున పోటీ చేసే అభ్యర్థులు కాదని, తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకుని ఓటేసే ప్రజలు గెలవాలని జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ అన్నారు. విశాఖలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలు మారుతూ ఎన్నికల్లో పోటీ చేసిన వారి వల్ల పార్టీలు, అభ్యర్థులు గెలుపొందవచ్చని అయితే ఓడిపోయేది ప్రజలేనన్నారు. మిగిలిన పార్టీలు, పోటీచేసే అభ్యర్థులు గెలవాలనుకుంటారని, జనసేన మాత్రం ప్రజలు గెలుపు కోరుకుంటుందన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలన్నది జనసేన ఉద్దేశమని, ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిందని లక్ష్మీనారాయణ అన్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలు జనసేనను 175 స్థానాల్లో గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. రైట్ మేన్ ఇన్ రాంగ్ పార్టీ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ, రైట్ మేన్ ఇన్ రైట్ పార్టీ అని పేర్కొన్నారు. తాను వృత్తి రీత్యా ఐపీఎస్‌ని మాత్రమే వదిలేశానని, ఐపీసీ, సీఆర్‌పీసీని వదల్లేదంటూనే, అవినీతి అనకొండల్ని ఎక్కడకు పంపాలో అక్కడకే పంపుతామన్నారు. తాను సర్వీసులో ఉండగా చేపట్టిన కేసులు, వాటి వివరాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోనని, తమ పార్టీ సిద్ధాంతాలతోనే ఎన్నికలు ఎదుర్కొంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్ చిన్నాన్న వివేకా హత్యపై స్పందిస్తూ దర్యాప్తు సంస్థల్ని స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోనివ్వాలని, వాటిని ప్రభావితం చేసేలా వాఖ్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేక సీబీఐ దర్యాప్తు కోరుతున్న విషయంలో దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలకు, వ్యక్తులకు జవాబుదారీ కాదని, న్యాయ వ్యవస్థకు మాత్రమే జవాబుదారీగా ఉంటారన్నారు.
తాను అంతరాత్మ ప్రబోధానుసారమే పనిచేస్తానని చెప్పారు. ప్రజల కోసం కామన్ మేనిఫెస్టోతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఐదు ప్రధాన సమస్యలను ఏ విధంగా పరిష్కరించేదీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. అభ్యర్థుల కన్నా పార్టీ మేనిఫెస్టో, సిద్ధాంతాలనే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామన్నారు. అన్ని రాజకీయపార్టీలు తమ గెలుపు చారిత్రాత్మక అవసరం అంటున్నారని, జనసేన ఒక్కటే మార్పుకు శ్రీకారం చుడుతుందన్నారు. సమావేశంలో జనసేన ప్రతినిధులు శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న విశాఖ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ