ఆంధ్రప్రదేశ్‌

కేసీఆర్ కాళ్ల ముందు ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పోటీ పడలేక మోదీ, కేసీఆర్, జగన్ ఒక్కటై కుట్రలు పన్నుతున్నారని, జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్లముందు తాకట్టు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ విమర్శించారు. ఆదివారం మంగళగిరి మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ ఎన్నికల ఖర్చు కోసం 1000 కోట్ల రూపాయలతో పాటు ప్రచార రథాలకు పంపిన కేసీఆర్ దమ్ముంటే ఆంధ్రా ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయాలని సవాల్ విసిరారు. ఆంధ్రులను ఎగతాళి చేసిన కేసీఆర్‌తో జగన్ పొత్తు పెట్టుకున్నారన్నారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లోనూ ఇచ్చిన హామీలను తాము నిలబెట్టుకున్నామని, ఎన్ని ఇబ్బందులున్నా 120 సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేశామన్నారు. పసుపు-కుంకుమ పథకంలో మహిళలకు 20వేల రూపాయలు ఇచ్చామని, మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ కనీసం 2వేల రూపాయల పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎండాకాలం మొదలుకాకుండానే విద్యుత్ కోతలు మొదలయ్యాయని, ఆంధ్రాలో 24గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. మొక్కజొన్న రైతులకు ధర రాయితీ పథకం వర్తించేలా ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. రేవేంద్రపాడులో మెయిన్ కెనాల్‌పై వంతెన శిథిలావస్థకు చేరుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, ఎన్నికలు పూర్తయ్యాక టెండర్లు పిలిచి పూర్తి చేస్తామన్నారు. దుగ్గిరాల మండలం పెనుమూళి, చిలుమూరు, కొండూరు, మంగళగిరి మండలం పెదవడ్లపూడి, మంగళగిరి ప్రాంతాల్లో రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని లోకేష్ వివరించారు. ఈసందర్భంగా టీడీపీలో చేరిన పలువురికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.