ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల నిర్మాణానికి త్వరలో రూ.1100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి త్వరలో 1100 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో నీరు-ప్రగతిపై ఆయన సోమవారం జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాపై దృష్టి సారించాలన్నారు. చెరువులు నింపేందుకు నీటిని విడుదల చేయాలని, వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ 11, 600 ట్రిప్పులు వేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి జనవరి 15 వరకూ బిల్లులను చెల్లించామని, త్వరలో మరో 107 కోట్ల రూపాయలు విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 8700 కోట్ల రూపాయల మేర ఉపాధి నిధులను ఉపయోగించుకున్నామని, రానున్న రెండు నెలల్లో 10 వేల కోట్ల రూపాయలకు ఈ మొత్తం చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. 26 శాఖలను ఉపాధి హామీ పనులతో అనుసంధానం చేయడం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు జరుగుతుండటంతో ఏపీ నుంచి వలసలు తగ్గాయన్నారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఆ రోజు వృద్ధులకు, మహిళలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 500 కన్నా ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.