ఆంధ్రప్రదేశ్‌

రాజమహేంద్రిలో ఇద్దరు కోడళ్ల అరంగేట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 25: సాధారణంగా రాజకీయ వారసత్వం నేతల కుమారులో, కుమార్తెలో అందిపుచ్చుకుంటుంటారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో రాష్టవ్య్రాప్తంగా పలు స్థానాల్లో ఇలా వారసులు రంగంలోకి దిగారు. అయితే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు కోడళ్లు మెట్టినింటి రాజకీయ వారసులుగా ఎన్నికల రణరంగంలోకి దిగారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యిర్థినిగా సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప, రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థినిగా ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ పోటీచేస్తున్నారు. రాజమహేంద్రవరం లోక్‌సభ, శాసనసభ స్థానాలకు వీరిరువురు ఒకే సమయంలో ఆరంగేట్రం చేయడం యాదృచ్ఛికమే అయినప్పటికీ విశేషత సంతరించుకుంది.
తూర్పుగోదావరి జిల్లా విలక్షణ రాజకీయాలకు ఆలవాలం. అందునా రాజమహేంద్రవరం పార్లమెంటు, సిటీ నియోజకవర్గాలు మరింత వైవిధ్యం. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా మాగంటి మురళీమోహన్ విజయం సాధించారు. అంతకు ముందు ఒకసారి ఓటమిచెందిన ఆయన ఐదేళ్ల పాటు నియోజకవర్గాన్ని వదలకుండా తిరిగారు. ఆ అభిమానమే ఆయనను గెలిపించిందని చెప్పొచ్చు. ఈవిడత ఆయన పోటీకి విముఖత చూపడంతో ఆయన కోడలు రూపకు పార్టీ టిక్కెట్ లభించింది.
ఈ స్థానం కోసం పలువురు పోటీపడినప్పటికీ, చివరకు రూపకే అవకాశం దక్కింది. మాగంటి రూప గోదావరి జిల్లా ఆడబిడ్డే. పుట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా. తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి కలిగిన రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తుండటం విశేషం. మాగంటి రూప విద్యావంతురాలు. రాజకీయంగా పూర్తి అనుభవం కలిగిన నాయకురాలని చెప్పలేము గానీ మామ ఎంపీ మాగంటి మురళీమోహన్‌తో పాటు రాజకీయ కార్యక్రమాలను చక్కబెట్టిన అనుభవం వుంది. 1973లో పుట్టిన రూప కార్పొరేట్ అండ్ సెక్రటేరియట్ గ్రూప్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1994లో మిస్ చెన్నై అవార్డు అందుకున్నారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానానికి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్, జనసేన అభ్యర్థి డాక్టర్ ఆకుల సత్యనారాయణతో హోరాహోరీ తలపడుతున్నారు. ఇక రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థినిగా పోటీచేస్తున్న ఆదిరెడ్డి భవానీ పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా రాజకీయ కుటుంబాలే. టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలైన ఆదిరెడ్డి భవానీ దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె. భవానీ అత్త ఆదిరెడ్డి వీరరాఘవమ్మ సైతం గతంలో రాజమహేంద్రవరం మేయర్‌గా పనిచేశారు. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నప్పటికీ పుట్టిల్లు, మెట్టినిల్లు రాజకీయ వాకిళ్ళే కాబట్టి సునాయాసంగా నెట్టుకొచ్చేస్తున్నారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆదిరెడ్డి భవానీకి సోదరుడు కింజరాపు రామ్మోహన్నాయుడు కూడా ఎంపీగా ఉండటంతో రాజకీయ సహకారం లభిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప, అటు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ తొలి ఎన్నికలను ఎదుర్కోవడం విశేషత సంతరించుకుంది.
చిత్రాలు..మాగంటి రూప *ఆదిరెడ్డి భవానీ