ఆంధ్రప్రదేశ్‌

నీతి, నిజాయితీ గల వ్యక్తులనే ఎన్నుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,మార్చి 25: సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి, నేరచరిత్ర కలిగిన వ్యక్తులను పక్కనపెట్టి, నీతి, నిజాయితీ గల వ్యక్తులకు పార్టీలతో సంబంధం లేకుండా ఓటు వేయాలని ఏపీ ప్రత్యేకహోదా,విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విజప్తి చేశారు. విశాఖలోని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగువారిలో ఉప ప్రాంతీయ, కుల-మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఓడించాలని, వర్గ ధన, మధ్య, కుల-మత ప్రలోభాలకు లోనుకాకుండా మంచి భవిష్యత్ ఇచ్చే వారిని ఎన్నుకోవాలని పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్రుల హక్కులను, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేవారికే మద్దతు ఇవ్వాలని, రాష్ట్రానికి, తెలుగుజాతికి ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా సరే అవినీతి, నేరచరిత్ర ఉన్న వారిని ఎన్నుకుంటే ప్రజల భవిష్యత్ అంధకారంగా ఉంటుందని, పార్టీలను చూసి ఓటు వేయకుండా అభ్యర్థి నీతి, నిజాయితీ చూసి ఓటు వేయాలన్నారు. నామినేషన్లు, విత్‌డ్రాల ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని నేరచరిత్ర కలిగిన వారి పేర్లను ప్రకటిస్తామన్నారు. అలాగే రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఇదే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆదికవి నన్నయ్య వర్శిటీ మాజీ వీసీ ఆచార్య జార్జివిక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థంతా డబ్బుతో ముడిపడిపోయిందని, ఈ అంశంపై ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సమావేశంలో ఆంధ్రా మేధావుల ఫోరం ప్రతినిధులు ఆచార్య అప్పలనాయుడు, శర్మ, జోగారావు, చక్రవర్తి, సురేష్‌బాబు పాల్గొన్నారు.