ఆంధ్రప్రదేశ్‌

ఆయన ఆలోచన మోసం.. అడుగులు వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మార్చి 25: చంద్రబాబు ఆలోచన మోసం, ఆయన వేసే అడుగులు వంచనకు దారితీస్తాయని వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రోజుకో అబద్దమాడుతున్నాడని, రోజుకోడ్రామా ఆడుతూ ప్రజలకు సినిమా చూస్తున్నారని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో జగన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు వేదికపై నుంచి ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ కూడా నేరవేర్చలేదన్నారు. పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన చంద్రబాబునాయుడుకు ప్రజలను మోసం చేయడం ఒక లెక్క కాదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి, ఆధర్మానికి మధ్య యుద్దం అని జగన్ అభివర్ణించారు. మరోసారి అధికారంలో రావడానికి బాబు మోసకారి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. బాబు హయాంలో రాష్ట్రం దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దగాకోరు పాలన సాగిస్తున్నారన్నారు. ఓట్ల కోసం బాబు డబ్బులు పంచుతున్నాడని అవి తీసుకుని మోసపోవద్దని చెప్పారు. ఐదేళ్ల పాలనలో బాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేరలేదన్నారు. మహిళలు, రైతులకు రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చివరకు బొటాబొటిగా విదిల్చారని, అవి వడ్డీలకే సరిపోయిందని పేర్కొన్నారు. ఆయనకు నిజంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశమే ఉంటే ఇప్పటికే సమస్యలు అన్ని పరిష్కరించేవాడని అన్నారు. రైతులను కాపాడాల్సిన చంద్రబాబే దళారీగా మారడంతో వారికి కష్టాలు తప్పడం లేదన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల జిమ్మిక్కులను నమ్మి మోసపోవద్దని ఆయన మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఎలాగైన గెలువాలన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు అప్పుడే గ్రామాలకు నోట్ల కట్టలు పంపారన్నారు. ఒక్కో ఓటు రూ.3 వేలకు కొనుగోలు చేయడానికి రంగం సిద్దం చేశాడని ఆరోపించారు. రూ.3 వేలకు ఆశపడితే రాబోయే కాలం అంతా ఇబ్బందులు తప్పవని అన్నారు. 20 రోజులు ఓపిక పడి ప్రజలు దీవిస్తే అధికారంలోకి వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

చిత్రం.. కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో
ప్రసంగిస్తున్న వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి